AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు

Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు

Phani CH
|

Updated on: Apr 21, 2026 | 8:16 PM

Share

తెలంగాణలో రికార్డు స్థాయిలో 45°Cకి చేరిన ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. తీవ్రమైన వడగాలుల ధాటికి ఇప్పటికే నలుగురు మృతి చెందారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, రాబోయే రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అయితే, రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.

తెలంగాణలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా భానుడి భగభగలకు రాష్ట్రం విలవిలలాడుతోంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గరిష్ట స్థాయికి చేరుకోవడంతో జనజీవనం పూర్తిగా అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును తాకడంతో ప్రజలు బయటకు రావడానికే వణికిపోతున్నారు. ఈ భయంకరమైన ఎండల తీవ్రతకు రాష్ట్రంలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు వృద్ధులు కూడా ఉండటం విషాదకరం. రానున్న రెండు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎండల ధాటికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. ఈ ఏడాది వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కుమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో గరిష్టంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా, జిల్లా కేంద్రమైన అసిఫాబాద్‌, నిర్మల్‌ జిల్లా బుట్టాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది వేసవిలో ఇలా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే అత్యధికం. జైనూర్, రాయపోలు వంటి ప్రాంతాల్లో వీస్తున్న వడగాలులు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మధ్యాహ్నం వేళ వీధులన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోవడంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 104 ప్రాంతాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగి, ఉష్ణోగ్రతలు మరో రెండు నుంచి మూడు డిగ్రీల మేర పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భానుడి ప్రతాపానికి తోడు వడగాలుల ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు, ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరటనిచ్చే వార్త కూడా అందించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కుమరం భీమ్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ వడగండ్ల వానల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు

400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!

భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

వేసవి తాపం తట్టుకోవడానికి నిమ్మరసం తాగుతున్నారా.. జాగ్రత్త

త్వరలోనే UPI నుంచి PF డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు

Follow Us