Mahavatar Parshuraam: మహావతార్ యూనివర్స్ నుంచి మరో వండర్
హోంబలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ విజయానంతరం మహావతార్ పరశురామ్ను ప్రకటించింది. ఈ యానిమేటెడ్ చిత్రం డిసెంబర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ స్థాయి 3D విజువల్స్ ఆశించవచ్చు. ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది.
యానిమేటెడ్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నూతన ట్రెండ్‌ను సృష్టిస్తున్న హోంబలే ఫిల్మ్స్, మహావతార్ నరసింహ గ్రాండ్ సక్సెస్ తర్వాత తమ సినిమాటిక్ యూనివర్స్ నుండి తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ఈ ప్రాజెక్ట్ మహావతార్ పరశురామ్ అని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. పరశురామ జయంతి సందర్భంగా రక్తశక్తమైన గొడ్డలితో ఉన్న మహావతార్ పరశురాముడి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. మహావతార్ నరసింహతో పోలిస్తే, ఈ కొత్త చిత్రంలో గ్రాఫిక్స్ నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కనిపించనుంది. హాలీవుడ్ స్థాయి 3D విజువల్స్‌ను ప్లాన్ చేస్తున్నారని, ఇది బాక్సాఫీస్ వద్ద మరో విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మహావతార్ నరసింహకు దర్శకత్వం వహించిన అశ్విన్ కుమార్ ఈ మహావతార్ పరశురామ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే స్టైల్ ఫాలో అవుతున్న దీపిక, రష్మిక
ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు
Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు
రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు
400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!
