AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షారుక్ ఖాన్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష్

షారుక్ ఖాన్ vs ప్రభాస్.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో బిగ్గెస్ట్ క్లాష్

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Apr 21, 2026 | 8:21 PM

Share

షారుఖ్ ఖాన్, ప్రభాస్ మధ్య 2026లో మరో భారీ బాక్సాఫీస్ యుద్ధం జరగనుంది. గతంలో సలార్, డంకీ క్లాష్ వల్ల రెండు సినిమాలకూ నష్టం వాటిల్లింది. ఇప్పుడు షారుఖ్ 'కింగ్' మరియు ప్రభాస్ 'ఫౌజీ' డిసెంబర్ 2026లో ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాల పోటీ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఈ క్లాష్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

బాక్సాఫీస్‌ దగ్గర మరోసారి షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ యుద్ధం చూడబోతున్నామా..? బిగ్గెస్ట్ థియేట్రికల్ వార్‌కు మరోసారి తెర లేవనుందా..? గతంలో ఓసారి ఢీ అంటే ఢీ అన్న ఈ ఇద్దరు సూపర్ స్టార్స్.. 2026లో సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారా..? ఈసారి షారుక్, ప్రభాస్ తలపడబోయే ఆ సీజన్ ఏంటి..? రేసులో ఉన్న ఆ సినిమాలేంటి..? సంక్రాంతికి రాజా సాబ్‌గా వచ్చిన ప్రభాస్.. 2026లోనే మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. కాకపోతే ప్రభాస్ రావాలనుకుంటున్న టైమ్‌లోనే షారుక్ కూడా రానున్నారు. డిసెంబర్ 24న షారుక్ నటిస్తున్న కింగ్ విడుదల కానుండగా.. అదే సీజన్‌లో ప్రభాస్ ఫౌజీ రానుందని తెలుస్తుంది. దసరా నుంచి ఈ సినిమా డిసెంబర్‌కు షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్, షారుక్ ఫైట్ ఇదే ఫస్ట్ టైమ్ కాదు.. 2023 డిసెంబర్‌లో కూడా సలార్, డంకీ సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌లోనే థియేటర్లలోకి వచ్చి ఒకదానికొకటి గట్టి పోటీని ఇచ్చుకున్నాయి. అప్పట్లో ఈ క్లాష్ వల్ల 2 సినిమాల కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా నార్త్, సౌత్ ఇండస్ట్రీల మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. అప్పుడు డంకీకి సౌత్‌లో థియేటర్లు దొరక్క ఓపెనింగ్స్ తగ్గితే, నార్త్ ఇండియాలో షారుఖ్ డామినేషన్ వల్ల సలార్‌కు మల్టీప్లెక్స్ స్క్రీన్స్ దొరకక కలెక్షన్ల పరంగా దెబ్బపడింది. ఇప్పుడు మళ్లీ ఫౌజీ, కింగ్ ఒకేసారి వస్తే కచ్చితంగా పాత సీన్ రిపీట్ అవుతుందని.. ఇద్దరు బడా హీరోల సినిమాలకు ఓపెనింగ్స్, థియేటర్ల కౌంట్ పరంగా నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఫౌజీ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో వస్తున్న పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాగా.. కింగ్ పూర్తిగా పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ మాఫియా కథగా రాబోతుంది. రెండూ డిఫెరెంట్ జోనర్స్. ఒకవేళ నిజంగా ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు ఒకేసారి బరిలో దిగితే మాత్రం.. ఈ క్లాష్ ఎపిక్ క్లాష్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆర్టీసీ సమ్మెలో సమ్మె సైరన్ అర్థరాత్రి నుంచి ఆగిపోనున్న బస్సులు

Weather Report : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఏపీలో మరింత పెరగనున్న ఎండలు

రెండు నెలలుగా నిద్ర లేదు.. యుద్ధాన్ని ఆపకుండా వదిలేది లేదు

400 ఏళ్ల చరిత్ర అంతం కాబోతుందా ?? కొండపల్లి కళాకారుల కన్నీటి గాథ !!

భారత్‌లో నెల సంపాదన.. విదేశాల్లో ఒక్క రోజులో వస్తోంది..

Follow Us