AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘L’ సెలబ్రేషన్ వెనుక ఇంత కథ ఉందా.. అసలు సీక్రెట్ చెప్పేసిన కాటేరమ్మ కొడుకు..!

Abhishek Sharma L Celebration: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో అభిషేక్ శర్మ పరుగుల ప్రవాహం పారించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని, స్టేడియంను హోరెత్తించాడు. 135 పరుగులతో అజేయంగా నిలిచి సన్‌రైజర్స్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్, తన రికార్డు ఇన్నింగ్స్, తనదైన ముద్ర 'ఎల్' వేడుకల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని వెల్లడించాడు.

Video: 'L' సెలబ్రేషన్ వెనుక ఇంత కథ ఉందా.. అసలు సీక్రెట్ చెప్పేసిన కాటేరమ్మ కొడుకు..!
Abhishek Sharma L Celebration
Venkata Chari
|

Updated on: Apr 22, 2026 | 8:04 AM

Share

Abhishek Sharma L Celebration: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఉప్పల్ స్టేడియంను హోరెత్తించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో మొత్తం 68 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతను టీ20 ఫార్మాట్‌లో 5,500 పరుగుల మార్కును అందుకోవడంతో పాటు, తన కెరీర్‌లో 9వ సెంచరీని (ఐపీఎల్‌లో రెండోది) నమోదు చేశాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ స్థాయికి తగ్గట్లుగా అతను సాగించిన ఈ ఇన్నింగ్స్ క్రికెట్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది.

‘ఎల్’ సెలబ్రేషన్ వెనుక ఉన్న కథ..

అభిషేక్ శర్మ సెంచరీ కొట్టిన ప్రతిసారీ లేదా కీలకమైన వికెట్ తీసినప్పుడు తన చేతులతో ‘ఎల్’ (L) ఆకారాన్ని ప్రదర్శిస్తుంటాడు. దీనిపై స్పందిస్తూ, “ఈ సెలబ్రేషన్ వెనుక చాలా మందికి తెలియని ఒక బలమైన కారణం ఉంది. ‘ఎల్’ అంటే నా దృష్టిలో ‘Love’ (ప్రేమ), ‘Loyalty’ (విశ్వసనీయత) అని అర్థం. ఉప్పల్ మైదానం నాకు హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇక్కడి అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చింది” అని అభిషేక్ వివరించాడు.

అభిమానులకు, కుటుంబానికి కృతజ్ఞత..

ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో తన తల్లిదండ్రుల సమక్షంలో శతకాన్ని అందుకోవడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నాడు. “నా తల్లిదండ్రులు గ్యాలరీలో ఉండగా సెంచరీ చేయడం ఒక కల నిజమైనట్లు అనిపించింది. అందుకే నా ‘ఎల్’ సెలబ్రేషన్‌ను ఈరోజు వారితో పాటు నాపై నమ్మకం ఉంచిన సన్‌రైజర్స్ యాజమాన్యానికి, అభిమానులకు అంకితం ఇస్తున్నాను” అని తెలిపాడు.

సన్‌రైజర్స్ ఇచ్చిన స్వేచ్ఛే కారణం..

2024 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ జట్టులో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చిందని, కుర్రాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రోత్సహిస్తుందని అభిషేక్ ప్రశంసించాడు. ఈ సానుకూల వాతావరణం వల్లే తాను నిర్భయంగా బ్యాటింగ్ చేయగలుగుతున్నానని, అందుకే ఈ స్టేడియం అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us