AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతితో పిసికిన టమాటా పచ్చడి.. వారానికి 3 సార్లు చేసినా వద్దు అనరు!

రోజూ రొటీన్‌గా చేసుకునే చట్నీలు, కూరలు తిని బోర్ కొట్టినప్పుడు లేదా జలుబు చేసి నోరంతా చప్పబడి నాలుకకు పట్టిన తుప్పు వదలాలి అనుకున్నప్పుడు గుర్తొచ్చే సరికొత్త రెసిపీ ఉత్తర కర్ణాటక టమాటా చట్నీ. ఈ పల్లెటూరి వంటకం ప్రత్యేకత ఏమిటంటే దీని తయారీకి మిక్సీ జార్ కానీ, రోలు కానీ అస్సలు అవసరం లేదు. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలను నూనెలో దోరగా వేయించి.. బాగా పండిన టమాటాలను రెండు ముక్కలుగా కోసి నూనెలో మెత్తగా రోస్ట్ చేస్తారు . 

Phani CH
|

Updated on: Oct 14, 2026 | 6:16 PM

Share
కావలసిన పదార్థాలు: 4 నుండి 5 బాగా పండిన టమాటాలు, 10 నుండి 12 ఎండు మిరపకాయలు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మలు కరివేపాకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 
అర చెంచా జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె

కావలసిన పదార్థాలు: 4 నుండి 5 బాగా పండిన టమాటాలు, 10 నుండి 12 ఎండు మిరపకాయలు, 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మలు కరివేపాకు, 1 మీడియం సైజు ఉల్లిపాయ,  అర చెంచా జీలకర్ర, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె

1 / 5
తయారీ విధానం:  స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఎండుమిరపకాయలను వేసి మంటను సిమ్‌లో ఉంచి మాడిపోకుండా దోరగా వేయించాలి. ఆ తర్వాత 7-8 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి రెండు నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి వాటిని కూడా ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.

2 / 5
అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నూనె వేయాలి. సగానికి కట్ చేసిన టమాటాలను కోసిన వైపు అడుగున ఉండేలా పాన్‌లో పేర్చాలి. సిమ్ మంటపై నిదానంగా రెండు వైపులా తిప్పుతూ టమాటాలు మెత్తబడి పై తొక్క ముడతలు పడేలా రోస్ట్ చేయాలి. టమాటాలు చక్కగా వేగాక.. అర చెంచా జీలకర్ర, చిటికెడు ఇంగువ చల్లి మరో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

3 / 5
ముందుగా వేయించి చల్లార్చిన ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలను ఒక గిన్నె లేదా ప్లేట్‌లోకి తీసుకోవాలి. చేతికి కొద్దిగా కొబ్బరినూనె రాసుకుని లేదా పప్పుగుత్తి సహాయంతో ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా నలపాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఇప్పుడు రోస్ట్ చేసిన టమాటాలను కూడా వేసి ఇష్టమైతే పై తొక్క తీసేయవచ్చు చేతితో మెత్తగా గుజ్జులా పిసుకుతూ అన్ని పదార్థాలు సమంగా కలిసేలా స్మాష్ చేయాలి.

4 / 5
కావాలనుకుంటే దీనికి ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టుకోవచ్చు, లేదా ఇలాగే నేరుగా వాడుకోవచ్చు. అంతే, నోరూరించే ఉత్తర కర్ణాటక విలేజ్ స్టైల్ 'టమాటా పచ్చడి' సిద్ధం ! వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా, పెరుగన్నంలో నంజుకున్నా, లేదా ఇడ్లీ, దోశల్లోకి నంజుకున్నా అమృతతుల్యంగా ఉండి నాలుకకు సరికొత్త రుచిని అందిస్తుంది!

5 / 5
Follow Us