బంగారం, వెండి, రాగిని తలదన్నుతూ రేసులోకి మరో మెటల్.. భవిషత్తులో దీనికి మరింత డిమాండ్..
బంగారం, వెండి, రాగికి పోటీగా మరో మెటల్ కూడా రేసులోకి వస్తోంది. ఇటీవల గోల్డ్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ఇతర లోహల వైపు చాలామంది చూపు పడుతోంది. బంగారం, వెండికి డిమాండ్ పెరగడంతో రాగి కూడా అదే బాటలో నడుస్తోంది. ఇప్పుడు తాజాగా..

Lithium Metal: తరచూ బంగారం, వెండి ధరల గురించి ప్రతీఒక్కరూ చర్చించుకుంటూ ఉంటారు. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో తెలసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పెళ్లిళ్లు లేదా ఏవైనా ఫంక్షన్లు వస్తే తొలుత బంగారం మీదే అందరి దృష్టి పడుతుంది. నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించేలా గోల్డ్ ధరించి సంతోషపడుతుంటారు. ముఖ్యంగా ఇండియాలో గోల్డ్‌ను పెద్ద సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. కేవలం ధరించడానికి మాత్రమే కాకుండా ఓ ఆస్తిగా కూడా దీనిని పరిగణిస్తారు. డబ్బులు ఉంటే వెంటనే గోల్డ్ కొనేసి దాచుకుంటారు. ఇక డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరి నోళ్లల్లో బట్టినా బంగారం, వెండి ధరల పెరుగుదల గురించే చర్చ జరుగుతోండగా… వీటికి పోటీగా మిగతా మెటల్స్ ధరలు కూడా పెరుగుతున్నాయి.
లిథియంకు పెరుగుతున్న డిమాండ్
బంగారం, వెండి ధరలు ఊహించనంత స్థాయిలో పెరుగుతుండటంతో ఇటీవల రాగికి డిమాండ్ పెరిగింది. రాగిని వివిధ వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల దాని ధర పెరుగుతోండగా.. ఇప్పుడు మరో మెటల్ కూడా రేసులోకి దూసుకొచ్చింది. అదే లిథియం. ఈ లోహంకు కూడా ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో ఇందులోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా లిథియంను బ్యాటరీ తయారీలో ఉపయోగిస్తారని మనకు తెలిసిన విషయం. ఇక బ్యాటరీల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ట్యాబుల తయారీలో వినియోగిస్తున్నారు. అలాగే ఇంధన, క్లీన్ ఎనర్జీ రంగాల్లో దీని వాడకం పెరిగిపోయింది. డిమాండ్ పెరుగుతున్న కారణంగా లిథియం ధరలు కూడా నానాటికి పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో ఇప్పుడు ఇందులో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ కూడా ఫోకస్
పాత బ్యాటరీలతో పోలిస్తే లిధియం బ్యాటరీలు వేగంగా ఛార్జ్ అవుతాయి. అలాగే మెరుగైన క్వాలిటీతో పాటు సామర్థ్యాన్ని అందిస్తాయి. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో లిథియం బ్యాటరీలకు డిమాండ్ తగ్గే అవకాశం లేదు. దీంతో భవిష్యత్తుల్లో వీటి డిమండ్ భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ప్రపంచంలోనే లిథియం నిల్వల్లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో చిలి ఉండగా.. ఆ తర్వాత అర్జెంటీనా, బొలీవియా, చైనాలో కూడా అత్యధికంగా ఉన్నాయి. ఇక భారత్ కూడా లిథియం నిల్వలపై దృష్టి పెట్టింది. లిథియం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. దేశంలో క్లీన్ ఎనర్జీని మెరుగపర్చడం, విదేశాల నుంచి దిగమతి చేసుకోవడాన్ని తగ్గించుకునేందుకు లిథియం అన్వేషణపై ఫోకస్ పెట్టింది.
