AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Startup Funding: స్టార్టప్ పెట్టుబడుల్లో భారత్ హవా.. ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ సొంతం

భారత్‌లో స్టార్టప్ రంగం జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. స్టార్టప్ కంపెనీల్లోకి పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. 2025లో భారత్‌లో స్టార్టప్‌లు భారీగా నిధులను సేకరించాయి. ఏఐ రంగంలోకి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. స్టార్టప్ పెట్టుబడుల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో భారత్ నిలిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Startup Funding: స్టార్టప్ పెట్టుబడుల్లో భారత్ హవా.. ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ సొంతం
Startups
Venkatrao Lella
|

Updated on: Jan 06, 2026 | 11:10 AM

Share

ఇండియాలో స్టార్టప్ రంగం వేగంగా అభివృద్ది చెందుతోంది. కొత్తగా ఎన్నో స్టార్టప్‌లు పుట్టుకొస్తుండగా.. వీటిల్లోకి పెట్టుబడుల ప్రవాహం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇండియాలో స్టార్టప్ రంగం అరుదైన రికార్డ్ సాధించింది. 2025లో స్టార్టప్‌ రంగంలో దాదాపు 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ప్రపంచంలో స్టార్టప్ కంపెనీల్లోకి ఎక్కువ నిధులు వచ్చిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2024తో పోలిస్తే 2025లో స్టార్టప్ ఫండింగ్స్ స్వల్పంగా తగ్గాయి. 2024తో పోలిస్తే దాదాపు 39 శాతం తగ్గి 1518 డీల్స్‌కు చేరుకుంది. 2024లో కంటే 2025లో నిధులు 17 శాతం తగ్గాయి.

2025లో సీడ్ స్టేజ్ నిధులు 1.1 బిలియన్ల డాలర్లకు గణనీయంగా పడిపోయాయి. 2024లో పోలిస్తే 30 శాతం తగ్గుదల నమోదు చేసింది. ఇక చివరి దశ నిధులు 2024తో పోలిస్తే 2025లో 26 శాతం తగ్గి 5.5 బిలియన్ డాలర్లకు పోడిపోయాయి. ఇక ప్రారంభంలో వచ్చిన పెట్టుబడులు 2024తో పోలిస్తే 7 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్ల పెరుగుదల నమోదు చేశాయి. ఇక 2025లో భారత్‌లో ఆర్టిఫీషియల్ రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తాయని చెప్పవచ్చు. గత సంవత్సరంలో ఏఐ రంగంలో 100 డీల్స్ జరిగాయి. వీటి ద్వారా ఏఐ స్టార్టప్ కంపెనీలు 649 బిలియన్ డాలర్లను సేకరించాయి. 2024లో పోలిస్తే గత ఏడాదిలో ఏఐలో 4.1 శాతం పెట్టుబడులు తగ్గాయి. ప్రారంభ దశలో ఏఐ స్టార్టప్ కంపెనీల్లోకి 273 బిలియన్ డాలర్లు రాగా.. చివరిలో 260 బిలియన్లు సేకరించాయి.

2025లో భారత్‌లో దాదాపు 30 నుంచి 40 శాతం స్టార్టప్ ఒప్పందాలు ఏఐ రంగంలోనే జరిగింది. భారత్‌లో పెరుగుతున్న పట్టణ జనాభా, సిలికాన్ వ్యాలీ శైలి వంటి మార్పులతో వ్యాపారం నుంచి గృహ సేవల వరకు వేగవంతమైన సేవలను అందించేలా ప్రయత్నాలు జరుగుతున్నారు. ఈ తరుణంలో వినియోగదారులు ఆకర్షించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తయారీ, ఫిన్‌టెక్, డీప్ టెక్ స్టార్టప్ కంపెనీల్లోకి పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో స్టార్టప్‌ల సంఖ్య పది రేట్లు పెరిగింది.  ఇక భారత్, అమెరికా మధ్య 2025లో మూలధన విస్తరణలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఫిచ్ డేటా ప్రకారం గత ఏడాది నాల్గొ త్రైమాసికంలో యూఎస్ వెంచర్ నిధులు 89.4 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఈ కాలంలో భారత్ స్టార్టప్ కంపెనీలు దాదాపు 4.2 బిలియన్ డాలర్లను సేకరించాయి.

ఆధార్ కార్డు అప్‌డేట్ చేయకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందా?
ఆధార్ కార్డు అప్‌డేట్ చేయకపోతే SBI YONO యాప్ బ్లాక్ అవుతుందా?
మట్టి ముట్టుకున్నా బంగారమే! సంక్రాంతి వేళ వీరికి కాసుల వర్షం!
మట్టి ముట్టుకున్నా బంగారమే! సంక్రాంతి వేళ వీరికి కాసుల వర్షం!
పల్లెలకు పాకిన రాకాసి.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
పల్లెలకు పాకిన రాకాసి.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!
ఈ అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయకుంటే బండి షెడ్డుకే..
ఈ అలవాటు మీకూ ఉందా? వెంటనే మానేయకుంటే బండి షెడ్డుకే..
కృత్రిమ ఊపిరితిత్తులు వస్తున్నాయ్.. IIT హైదరాబాద్‌లో పరిశోధనలు!
కృత్రిమ ఊపిరితిత్తులు వస్తున్నాయ్.. IIT హైదరాబాద్‌లో పరిశోధనలు!
పరమాన్నం పల్చగా అవుతోందా? పండుగకు పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ
పరమాన్నం పల్చగా అవుతోందా? పండుగకు పర్ఫెక్ట్ స్వీట్ రెసిపీ
ప్రపంచంలోనే మొట్టమొదటిది బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 కి.మీ.
ప్రపంచంలోనే మొట్టమొదటిది బైక్‌.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 కి.మీ.
ఇద్దరు చిన్నారుల దత్తత వెనక అసలు కారణం చెప్పిన శ్రీలీల
ఇద్దరు చిన్నారుల దత్తత వెనక అసలు కారణం చెప్పిన శ్రీలీల
జనవరి 31లోపు ఈ పని చేయకుంటే జీతం, ప్రమోషన్‌ నిలిపివేత!
జనవరి 31లోపు ఈ పని చేయకుంటే జీతం, ప్రమోషన్‌ నిలిపివేత!
పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే..!
పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారంటే..!