AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే ప్రతీఒక్కరికీ బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్..

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వాడే ప్రతీఒక్కరికీ అలర్ట్. మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే గ్యాస్ సిలిండర్ పొందటంలో, ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీలు పొందటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా నిర్ణీత గడువులోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

Gas Cylinder: గ్యాస్ సిలిండర్ వాడే ప్రతీఒక్కరికీ బిగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్..
Gas Cylinders
Venkatrao Lella
|

Updated on: Jan 06, 2026 | 9:12 AM

Share

ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. వెంటనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్‌కు ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. మీకు రావాల్సిన గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఆగిపోతాయని, అంతేకాకుండా భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేరని హెచ్చరించింది. అందుకే వీలైనంత త్వరగా లబ్దిదారులు తమకు గ్యాస్ పంపిణీ చేస్తున్న ఏజెన్సీలను సంప్రదించి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. దీని వల్ల గ్యాస్ సబ్సిడీ పొందటంలో ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది.

సబ్సిడీ డబ్బులు కట్

కొంతమంది ఒకే పేరుపై వేర్వేరు చోట్ల గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారు. అలాగే ఒకే ఇంట్లో ఒకరి కంటే ఎక్కువమంది రాయితీ పొందుతున్నారు. దీంతో నకిలీ సబ్సిడీలను తొలగించి అర్హులైన వారు మాత్రమే లబ్ది పొందేలా కేవైసీ ప్రక్రియను దేశవ్యాప్తంగా కేంద్ర పెట్రోలియం శాఖ ప్రవేశపెట్టింది. ప్రతీఒక్కరూ తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా నిబంధన విధించింది. కేవైసీ చేయించుకున్నవారికి మాత్రమే ప్రభుత్వాలు అందించే సబ్సిడీ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. లేకపతే నిధులు ఆగిపోతాయని తెలిపింది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందేవారు మాత్రమే కాకుండా సాధారణ వినియోగదారులు కూడా ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. అలాగే సబ్సిడీపై వీరికి గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ నిధులు ఆగిపోతే అవకాశముంది. ఇక తెలంగాణలో కేవలం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. కేవైసీ పూర్తి చేయకపోతే అవి నిలిచిపోయే ప్రమాదముంది.

ఎలా చేసుకోవాలంటే..?

మీ ఇంటికి గ్యాస్ డెలివరీ చేయడానికి వస్తే డెలివరీ బాయ్ ద్వారా మీరు కేవైసీ పూర్తి చేయవచ్చు. డెలివరీ బాయ్ దగ్గర బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. ఈ డివైస్‌లో మీ ఫింగర్‌ప్రింట్ ఇచ్చి కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా మీరు గ్యాస్ ఎక్కడైతే తీసుకున్నారో ఆ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఈ ప్రక్రియ కంప్లీట్ చేయొచ్చు. ఇందుకోసం ఆధార్, గ్యాస్ పాస్‌బుక్, మొబైల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం మీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన వెబ్ సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్, మొబైల్ ఓటీపీ ద్వారా కేవైపీ పూర్తి చేయొచ్చు.