Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగదారులకు బిగ్ షాక్.. భారీగా ఛార్జీలు పెంపు.. కొత్తగా ధరలు ఇలా..
ఆధార్ కార్డుదారులకు యూఐడీఏఐ షాకిచ్చింది. ఆధార్ పీవీసీ కార్డు ఛార్జీలను భారీగా పెంచింది. గతంలో రూ.50లు ఉండగా.. ఇప్పుడు మరింతగా పెంచింది. పెంచిన ఛార్జీలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆధార్‌ను ప్రజలు సురక్షితంగా, భద్రంగా వాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) బిగ్ షాకిచ్చింది. ఆధార్ అప్డేట్, కార్డుల జారీ ఛార్జీలను పెంచింది. ఆధార్ కార్డుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి దుర్వినియోగం కాకుండా యూఐడీఏఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొత్తగా అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెడుతుండగా.. అక్రమాలను నివారించేందుకు పేపర్‌లెస్ ఆధార్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ ఇటీవల లాంచ్ చేసింది. దీని ద్వారా ఆధార్ ఫిజికల్ కాపీ అవసరం లేకుండా డిజిటల్ విధానం ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశంలో ఆధార్ ధృవీకరణ అవసరమైతే యాప్ ద్వారానే మనం చేసుకునే సదుపాయం కల్పించింది.
పీవీసీ కార్డ్ ఛార్జీలు
ఇక ఆధార్ కార్డును సురక్షితంగా వినియోగించుకునేందుకు ఏటీఎం సైజ్ తరహాలోనే ఉండే పీవీసీ కార్డులను కొత్తగా తీసుకొచ్చింది. గతంలో పీవీసీ కార్డు పొందేందుకు రూ.50 ఛార్జీ ఉండగా.. ఇప్పుడు రూ.75 చేసింది. జనవరి 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పీవీసీ కార్డ్ కోసం గతంలో కంటే అదనంగా 50 శాతం మేర చెల్లించాల్సి వస్తుంది. యూఐడీఏఐ పోర్టల్ లేదా ఎంఆధార్ యాప్ ద్వారా ఈ పీవీసీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీరు సెలక్ట్ చేసుకున్న అడ్రస్‌కు కార్డు పంపిస్తారు. స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు కార్డు అందుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డు తరహాలోనే ఉండే ఈ పీవీసీ కార్డుల్లో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. జేబులో పట్టేంత సైజులో చిన్నగా ఉండే ఈ ఆధార్‌ను సులువుగా క్యారీ చేయవచ్చు. అలాగే ఇందులో ఉండే భద్రతా ఫీచర్లు ఆధార్ దుర్వినియోగం కాకుండా కాపడతాయి.
పీవీసీ కార్డ్ ఫీచర్లు
ట్యాంపర్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్ ,మైక్రో టెక్ట్స్, ఘోస్ట్ ఇమేజ్, జారీ తేదీ, ప్రింట్ తేదీ, ఎంబోస్డ్ లోగో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ ఆధార్‌ను స్మార్ట్‌గా వాడటంతో పాటు దుర్వినియోగం ఆపడం, మీ గుర్తింపును రక్షించడానికి ఉపయోగపడతాయని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో వీటి వివరాలు వెల్లడించింది. అయితే ఇటీవల పీవీసీ కార్డుల తయారీకి వాడే ముడి సరుకు ధరలు పెరిగాయి. ప్రింటింగ్, డెలివరీ ఖర్చులు పెరిగాయి. కార్డుల డిస్ట్రిబ్యూషన్‌కు ఎక్కువ ధర అవుతుంది. దీంతో జనవరి 1 నుంచి పీవీసీ కార్డుల కోసం రూ.75 వసూలు చేస్తోంది. అలాగే ఇతర వివరాలు అప్డేట్ చేసుకునేందుకు కూడా జనవరి 1 నుంచి ఛార్జీలను యూఐడీఏఐ పెంచింది.
