అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు
తెలుగు వారిని కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు టీవీ తెరపై ‘జబర్దస్ షో’ పాపులర్ అయినంతగా మరో ప్రోగ్రాం క్లిక్ అవ్వలేదనే చెప్పాలి. ఈ షోలో నటుల నటన, డైలాగ్స్ పగలబడి నవ్వేలా చేస్తాయి. ఈ ప్రోగ్రాంలో కమెడియన్‌గా గుర్తింపు పొందిన ఎంతోమంది కాలక్రమేణా షోకు దూరమైపోయారు.

జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ లో షేకింగ్ శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు షేకింగ్ శేషు. ఈ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీపై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ కార్యక్రమం పట్ల ఆర్పీ చేసిన వ్యాఖ్యలు, సంస్థ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని విమర్శించడాన్ని శేషు ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో, జబర్దస్త్ వేదికపై పది నిమిషాలు నవ్వించడం ఎంత కష్టమో వివరించారు. స్క్రిప్టులు రాయడానికి ఎంతో శ్రమ పడతారని, అది అంత ఈజీకాదని తెలిపారు. సుధీర్, రామ్ ప్రసాద్ వంటి సీనియర్ ఆర్టిస్టులు అనుభవంతో, కామెడీతో అప్పటికప్పుడు స్కిట్‌లు చేసినా, కొత్త వారికి అది సులభం కాదని చెప్పారు. సంస్థను విడిచిపెట్టడం తప్పు కాదని, కానీ సంస్థను దూషించడం కరెక్ట్ కాదు అని శేషు అభిప్రాయపడ్డారు.
కిరాక్ ఆర్పీ జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన ఊర్లో ఒక నిర్మాతను ఒప్పించి సినిమా ప్రారంభించాలని చూశాడని చెప్పారు. జేడీ చక్రవర్తి, నాగబాబు వంటి ప్రముఖులతో ముహూర్తం పెట్టించి హడావిడి చేసినా, సినిమా ప్రారంభం కాకుండానే నిర్మాతకు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని శేషు వెల్లడించారు. ఈ విషయంలో మీడియాలో కూడా వార్తలు వచ్చాయని, ఛాంబర్‌లో కూడా ఫిర్యాదు నమోదైందని, ఆర్పీపై ఇప్పటికీ కేసు నడుస్తోందని తెలిపారు శేషు. కిరాక్ ఆర్పీ తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన హోమ్ టూర్ వీడియోపై శేషు విమర్శలు గుప్పించారు. మూడు కోట్లకు పైగా విలువైన ఆ విలాసవంతమైన ఇల్లు ఆర్పీది కాదని, ప్రముఖ ఇంటీరియర్ డెకరేటర్దని అన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, రేటింగ్‌ల కోసం ఆర్పీ ప్రజలను మోసం చేశాడని, ఈ విషయం స్వయంగా జబర్దస్త్ సహచరుల ద్వారా తనకు తెలిసిందని శేషు స్పష్టం చేశారు.
జబర్దస్త్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని దేవుడితో పోల్చుతూ, ఆయనకు ఎలాంటి వివాదాలు లేవని శేషు ప్రశంసించారు. జబర్దస్త్ ప్రారంభానికి శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురు స్వప్న కీలక పాత్ర పోషించారని తెలిపారు. కార్యక్రమంపై అనేక కేసులు వచ్చినప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్వయంగా వాటిని చూసుకున్నారని, ఆర్టిస్టులు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూశారని.. అలాంటి వ్యక్తిని నిందించే నైతిక హక్కు ఆర్పీకి లేదని శేషు అన్నారు. అంతే కాదు విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు తీసుకొచ్చాడని, నిశ్చితార్థం చేసుకున్నాడని చెప్పారు. ఆర్పీకి ఆస్తులు లేకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారని, అప్పుడు ఆర్పీ తన స్నేహితుల ఆస్తులను తన పేరు మీదకు రాయించుకోవాలని ప్రయత్నించాడని, స్నేహితులు నిరాకరించారని శేషు వెల్లడించారు. తన పదేళ్ల విశాఖపట్నం ఉద్యోగ జీవితం వల్ల అక్కడ తనకున్న సర్కిల్ ద్వారా ఈ విషయాలు తెలిశాయని శేషు తెలిపారు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




