Mana Shankara VaraPrasad Garu: ట్రెండింగ్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్.. ఇప్పటిదాకా ఎంత మంది చూశారంటే?
ఆదివారం (జనవరి 04)న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. వింటేజ్ మెగాస్టార్ ను చూశామంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ మెగా మూవీ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నామస్మరణతో టాలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్‌గా మారింది. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కేవలం యూట్యూబ్ రికార్డులనే కాదు, సినీ అభిమానుల గుండెల్ని కూడా షేక్ చేస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ‘మెగా’ మేనియా కనిపిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సమకాలీన స్టార్ హీరోల ట్రైలర్ రికార్డులను అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో బాస్ ముందే చూపిస్తున్నారు.
వింటేజ్ చిరంజీవి లుక్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలగలిపి ఈ ట్రైలర్‌ను ఒక విజువల్ ఫీస్ట్‌గా మార్చేశాయి. ట్రైలర్ చివరలో వచ్చే మాస్ డైలాగ్స్ చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ మరో భారీ ప్లాన్ చేస్తోంది. జనవరి 7న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా హాజరుకాబోతున్నారు. వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్ చూడాలని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానులకు, ఒకే వేదికపై ఈ ఇద్దరు దిగ్గజాలను చూడటం ఒక మర్చిపోలేని అనుభూతి కానుంది. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య సాగే కెమిస్ట్రీనే ప్రధాన ఆకర్షణ కావడంతో, ఈ ఈవెంట్ పై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల కన్ను పడింది.
యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్..
The internet is under SWAG KA BAAP’s control 😎🔥#MSGTrailer TRENDING at #1 on YouTube with a record-breaking 25 MILLION+ views in 24 hours❤️🔥💥
— https://t.co/MrHIIt5eIR #MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY 2026.#ManaShankaraVaraPrasadGaru #MSGonJan12th pic.twitter.com/4ElJuB4JKS
— Shine Screens (@Shine_Screens) January 5, 2026
ట్రైలర్ రెస్పాన్స్ చూసిన డిస్ట్రిబ్యూటర్లు సినిమా రేంజ్ మారిపోయిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ తో పాటు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు క్యూ కట్టే అవకాశం ఉంది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ లోపు జనవరి 7న జరగబోయే ఈవెంట్ సినిమాపై ఉన్న అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లడం ఖాయం.
మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




