AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో పాతి పెట్టే భార్య.. ఓటీటీలో సెన్సేషనల్ రియల్ క్రైమ్ స్టోరీ

ఆ మధ్యన భర్తల్ని భార్యలు రకరకాలుగా చంపుతూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్త శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది. ఎవరికీ అనుమానం రాకుండా ఒక డ్రమ్ములో పాతి పెట్టింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

OTT Movie: భర్తను ముక్కలుగా నరికి డ్రమ్ములో పాతి పెట్టే భార్య.. ఓటీటీలో సెన్సేషనల్ రియల్ క్రైమ్ స్టోరీ
Honeymoon Se Hatya Web series
Basha Shek
|

Updated on: Jan 04, 2026 | 7:30 PM

Share

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీల్లో రియల్ క్రైమ్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఆ మధ్యన భర్తల్ని భార్యలు చంపిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. సౌరభ్ అనే మర్చంట్ నేవీ ఆఫీసర్ ను అతని భార్య ముస్కాన్ దారుణంగా హత్య చేసింది. ప్రియుడు సాహిల్ తో కలిసి సౌరభ్ శరీర భాగాలను ముక్కలు చేసి బ్లూ డ్రమ్ములో పడేసింది. సౌరభ్ కుమార్తె తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో ఈ దారుణం బయటకొచ్చింది.

ఇక మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని కూడా అతని భార్య ఇలాగే హత మార్చింది. భర్తను హనీమూన్ కు తీసుకెళ్లిన సోనమ్ తన ప్రియుడి కలిసి రఘువంశీని కిరాతకంగా హత మార్చింది.   ఘటన జరిగిన సుమారు  11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో హత్య అని అనుమానించారు. భార్య సోనమ్ కోసం గాలించగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో ప్రత్య‍క్షమైంది. పోలీసులు విచారించగా  ప్రియుడితో కలిసి భర్తని హత్య చేయించినట్లు ఒప్పుకొంది. ఇందుకోసం మరో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ కు సుఫారీ ఇచ్చింది. ఈ కేసులతో పాటే దేశంలో సంచలనం రేపిన మరో 3 కేసులను కూడా ఈ వెబ్ సిరీస్‌లో చూపించారు. అజితేష్ శర్మ తెరకెక్కించిన ఈ రియల్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ పేరు హనీమూన్ సే హత్య. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ నెల 9 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు జీ 5 నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?
కాపర్ లేదా స్టీల్.. నీరు తాగేందుకు ఏది బెటర్! ఈ విషయాలు తెలుసా?
ఈ కారు ధర కేవలం రూ.5.99 లక్షలే.. మైలేజీ 30 కి.మీ..
ఈ కారు ధర కేవలం రూ.5.99 లక్షలే.. మైలేజీ 30 కి.మీ..
రోగాలకే చుక్కలు చూపించే కూర.. పవర్ తెలిస్తే అస్సలు వదలరు..
రోగాలకే చుక్కలు చూపించే కూర.. పవర్ తెలిస్తే అస్సలు వదలరు..
అధిక వడ్డీల ఆశ చూపాడు.. అందినకాడికి దోచేశారు..
అధిక వడ్డీల ఆశ చూపాడు.. అందినకాడికి దోచేశారు..
రాత పరీక్షలేకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
రాత పరీక్షలేకుండానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
'TET నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే'.. AIASTF డిమాండ్
'TET నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే'.. AIASTF డిమాండ్
ఇలా వండితే చికెన్ విషమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే
ఇలా వండితే చికెన్ విషమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే
రాత్రి నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష..ఉదయాన్నే తీసుకుంటే లాభాలు
రాత్రి నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష..ఉదయాన్నే తీసుకుంటే లాభాలు
పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్
పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్
చలికాలం చిలగడదుంప తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
చలికాలం చిలగడదుంప తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే