OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సిరీస్.. యూజర్ల దెబ్బకు నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్
ఇంగ్లిష్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ఈ సిరీస్ ను చూడాలని మూవీ లవర్స్ తహతహలాడిపోయారు. కట్ చేస్తే.. యూజర్ల తాకిడికి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సర్వర్లు క్రాష్ అయ్యాయి..

OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్‌హిట్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సిరీస్‌లోని ఎనిమిదవ, చివరి ఎపిసోడ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా ఈ ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ‘ది రైట్‌సైడ్ అప్’ పేరుతో ఎనిమిదో ఎపిసోడ్ రాగానే నెట్‌ఫ్లిక్స్ సర్వర్ క్రాష్ అయింది. ఫైనల్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిన వెంటనే, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షకులు ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్‌పై పడ్డారు. దీంతో అకస్మాత్తుగా ఈ OTT ప్లాట్‌ఫామ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. మీడియా నివేదికల ప్రకారం, దాదాపు ఒక నిమిషం పాటు నెట్ ఫ్లిక్స్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సమయంలో యూజర్ల స్క్రీన్‌లపై సందేశం వచ్చింది. ‘ఏదో తప్పు జరిగింది. క్షమించండి. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం. అప్పటి వరకు, మీరు హోమ్ పేజీలో ఇతర సినిమాలు, సిరీస్ లను చూడవచ్చు’ అని నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.
ఈ సమస్య కొద్దిసేపటికే పరిష్కరించబడినప్పటికీ, ప్రేక్షకుల కోపం సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపించింది. చాలా మంది స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు దానిపై మీమ్స్ వైరల్ చేశారు. దీని కారణంగా, ఈ సమస్య సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ పరిస్థితిని చక్కదిద్ద క్రమంలో వెబ్ సిరీస్ మేకర్స్, నెట్‌ఫ్లిక్స్ ఆడియెన్స్ కు క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ సర్వర్లు ఈ విధంగా క్రాష్ కావడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు, జూలై 2022లో ‘స్ట్రేంజర్ థింగ్స్ 4’ చివరి ఎపిసోడ్‌లో ఇలాంటి సమస్య తలెత్తింది. ఇక గతేడాది నవంబర్ 27 ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య తలెత్తింది. అయినప్పటికీ ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా ఇంగ్లిష్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2016 లో నెట్‌ఫ్లిక్స్ OTT లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ తర్వాత రెండవ సీజన్ 2017 లో, మూడవ సీజన్, 2019 లో, నాలుగో సీజన్ 2022 లో స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇప్పుడు ఐదో సీజన్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
El final de Stranger Things es de los más insulsos que nos trajo la televisión.Incoherencias por doquier. No tiene agujeros de guion…Es un cráter gigante. personajes con un plot armor que dejan sin emoción ni consecuencias a la serie más popular de Netflix#StrangerThings5finale pic.twitter.com/adUTxhtATD
— Emi (@emi_peloso) January 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




