Bigg Boss Emmanuel: ఎంత ముద్దుగా పిలిచాడో! బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ ప్రియురాలిని చూశారా? ఎమోషనల్ పోస్ట్ వైరల్
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే తన లవ్ స్టోరీని బయట పెట్టాడు. ఆమెను చాలా బాధ పెట్టానని , తన కోసమే బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నానంటూ ఎమోషనల్ అయ్యాడు.అంతేకాదు బిగ్ బాస్ షో కంప్లీట్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పుకొచ్చాడు.

ఆ మధ్యన ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక దశలో టైటిల్ గెలుస్తాడనుకున్న ఇమ్మూ చివరకు నాలుగో ప్లేస్ తో సరిపెట్టుకోవడంపై అతని అభిమానులు నిరాశకులోనయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మూ మళ్లీ టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ కానున్నాడని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు ఇమ్మూ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం తన ప్రియురాలిని పరిచయం చేస్తూ ఇమ్మూ షేర్ చేసిన పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడీ జబర్దస్త్ కమెడియన్. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసున్న ఒక ఫొటోను పంచుకుంటూ..
‘వేస్ట్ అమ్మా (ఇమ్మూ తన గర్ల్ ఫ్రెండ్ ను ప్రేమగా వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటాడు).. నా లైఫ్ లోకి వచ్చినందుకు, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ. నిన్ను నేను చాలా బాధపెట్టాను. కానీ, ఈ ఏడాది నుంచి మనం ఇంకా స్ట్రాంగ్ ఉండి.. జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇప్పటినుంచి నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నా. నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి నువ్వే. నా లైఫ్ లో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నాకు ఎల్లప్పుడూ అండగా నిలబడ్డందుకు, అపారమైన ప్రేమను పంచినందుకు థాంక్యూ సో మచ్’ అని తన ప్రియురాలిపై ప్రేమను కురిపించాడు ఇమ్మూ.
ఇమ్మాన్యుయేల్ షేర్ చేసిన పోస్ట్..
View this post on Instagram
ప్రస్తుతం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టును బట్టి ఇమ్మూ ప్రియురాలి పేరు రుచి అని తెలుస్తోంది. అయితే ఇమ్మూ షేర్ చేసిన ఫోటోలో ఆమె ముఖం దాచుకుంది. ఇది చూసిన అభిమానులు వదినను ఎప్పుడు చూపిస్తావ్? అని అడుగుతున్నారు. దీనికి స్పందించిన ఇమ్మాన్యుయేల్.. త్వరలోనే చూపిస్తానని రిప్లై ఇచ్చాడు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




