AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Murari: ‘మురారి’ రీ రిలీజ్.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన క్లాసిక్ సినిమా ‘మురారి’ మళ్లీ వెండితెరపై సందడి చేస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా బుధవారం (డిసెంబర్ 31) ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజైంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఆడియెన్స్ ఈ మూవీని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

Murari: 'మురారి' రీ రిలీజ్.. ఈ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Murari Movie
Basha Shek
|

Updated on: Jan 01, 2026 | 9:51 AM

Share

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలున్నా మురారీ మాత్రం చాలా స్పెషల్. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా, మహేశ్ బాబును ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది. ఇందులోని కథ, కథనాలు, భావోద్వేగాలు, పాటలు, నటీనటుల యాక్టింగ్.. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరాయి. అందుకే ‘మురారి’ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఫెవ‌రేట్‌. కాగా ఇప్పుడీ మూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త సంవత్సరం కానుకగా బుధవారం (డిసెంబర్ 31) 4K వెర్షన్ తో మురారీ థియేటర్లలో రీ రిలీజైంది. మహేష్ అభిమానులతో పాటు ఆడియెన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ మురారి సినిమాను తెరకెక్కించారు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. అలాగే లక్ష్మీ, గొల్లపూడి, సత్య నారాయణ వంటి ఎందరో సినీ దిగ్గజాలు ఈ మూవీలో నటించారు. అయితే సినిమా కథ మొత్తం హీరో మహేష్ చుట్టే తిరుగుతుంది. అయితే ఈ మురారి సినిమాకు మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదట. కృష్ణవంశీ ముందుగా ఈ కథను అక్కినేని నాగార్జునకు వినిపించారట. అప్పటికే వీరి కాంబోలో నిన్నే పెళ్లాడతా వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. దీంతో నాగ్ కూడా మురారి సినిమా కథ విని చాలా బాగుందని కితాబు ఇచ్చాడట. అయితే ఈ కథ అక్కినేని సుమంత్ తో చేయాలని, తానే ఈ సినిమాను నిర్మిస్తానని నాగార్జున అన్నారట.

ఇవి కూడా చదవండి

మురారి రీ రిలీజ్.. కృష్ణ వంశీ పోస్ట్..

అయితే నాగార్జున ఆఫర్ కు కృష్ణవంశీ ఒప్పుకోలేదట. ఈ చిత్రాన్ని చేస్తే మీతోనే చేస్తాను, లేదంటే మహేష్ బాబు తో చేస్తాను అని చెప్పారట. అలా చివరికి మురారి కథ మహేష్ బాబు వద్దకి చేరింది. ఇక ఆ తర్వాత ఏమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.