AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి.. నటి పావలా శ్యామలకు సజ్జనార్ ఆత్మీయ పరామర్శ.. వీడియో

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అత్యంత వినూత్నంగా ఒక మంచి సేవా కార్యక్రమంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారాయన. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సీపీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలి.. నటి పావలా శ్యామలకు సజ్జనార్ ఆత్మీయ పరామర్శ.. వీడియో
CP Sajjanar
Basha Shek
|

Updated on: Jan 01, 2026 | 5:12 PM

Share

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలను వినూత్నంగా జరుపుకొన్నారు. గురువారం (జనవరి 01) ఓ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన అక్కడి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతూ అక్కడే ఆశ్రయం పొందుతోన్న సీనియర్‌ నటి పావలా శ్యామలను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్) లో షేర్ చేసిన సజ్జనార్ నేటి యువతకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. ‘నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను. సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48 మంది పెద్దల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం ఆనందాన్ని కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్‌ నటి పావలా శ్యామల గారిని పరామర్శించాను. కష్టకాలంలో ఉన్న ఆమెను ఆదుకుని, ఈ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో చేర్పించిన మన తిరుమలగిరి ఏసీపీ రమేష్‌ చొరవ అభినందనీయం. గత 18 ఏళ్లుగా వేలాది మందికి ఉచిత వైద్యం, ఆశ్రయం కల్పిస్తున్న డాక్టర్ రామకృష్ణ గారి సేవ స్ఫూర్తిదాయకం’

‘ఈ సందర్భంగా నాదొకటే విన్నపం.. ‘వృద్ధాశ్రమాలు లేని సమాజం’ రావాలి. మనల్ని కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల రుణం ఎంత సేవ చేసినా తీరనిది. ఆధునిక జీవనశైలి, ఒత్తిళ్ల సాకుతో వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయవద్దు. చరమాంకంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదు.. పిల్లల ఆప్యాయత, నాలుగు తీపి మాటలు మాత్రమే. తల్లిదండ్రులను భారంగా కాకుండా.. బాధ్యతగా, దైవంగా భావిద్దాం. వారి సేవలోనే నిజమైన ఆనందం, మోక్షం వెతుక్కుందాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!’ అని రాసుకొచ్చారు సజ్జనార్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వృద్ధాశ్రమలో సీపీ సజ్జనార్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
డైట్ సీక్రెట్ రివీల్ చేసిన హీరోయిన్ ఆమని..
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
తక్కువ ధరలో ట్రిగ్గర్‌‌ ట్రేజ్‌2 వైర్‌‌లెస్‌ ఇయర్‌‌ బడ్స్‌
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు! వాస్తు ప్రకారం పెంచకూడనివి
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
మీతో పాటు ట్రైన్‌లో సైకిల్ తీసుకెళ్లవచ్చా..? లగేజీ రూల్స్
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్‌ నాయిస్‌ఫిట్‌ హలో లిమిటెడ్ ధర ఎంతంటే
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
 ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
SLBC టన్నెల్‌లో బిగ్ ప్రోగ్రెస్.. షీర్ జోన్ దాటేశారు.
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్
శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్.. స్పెషాలిటీస్