AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఏకంగా 9 ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా

సాధారణంగా కొత్త సినిమాలు ఒకటి లేదా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఏకంగా 9 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తోంది. అది కూడా ఐదు భాషల్లో. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

OTT Movie: ఏకంగా 9 ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా
4 Girls Movie
Basha Shek
|

Updated on: Jan 01, 2026 | 6:12 PM

Share

సాధారణంగా సినిమాలన్నీ థియేటర్లలో రిలీజైన తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే డైరెక్టుగా ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఏకంగా తొమ్మిది స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో. అమెజాన్ ప్రైమ్, బీసీఐనీట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్, వాచో, వ్యూడ్, క్లౌడ్ మేకర్, జీసన్‌తోపాటు అమెజాన్ ఫైర్ స్టిక్ యాక్సెస్ ఉన్న టీవీలలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం , హిందీ , కన్నడ , మలయాళం భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, గ్యాంగ్ రేప్ ఘటనల నేపథ్యంలో థ్రిల్లింగ్ గా ఈ సినిమా సాగుతుంది. ఒక యథార్థ సంఘటన ఆధారంగా.. తన చెల్లికి జరిగిన అన్యాయానికి అక్క, ఆమె స్నేహితులు కలిసి ఎలా పగ తీర్చుకున్నారనేది ఈ సినిమాలో చూపించారు.

పోలీస్ స్టేషన్, కోర్టుల్లో న్యాయం దొరకనప్పుడు సమాజానికి ఎదురెళ్లి తప్పుడు దారిలోనైనా వెళ్లి నేరస్థులను శిక్షించాలన్న సామాజిక సందేశంతో తెరకెక్కించిన ఈ సినిమా పేరు 4 గర్ల్స్. ఎస్ శివ తెరకెక్కించిన ఈ సినిమాలో శృతిక గాఒక్కర్, ఆకాంక్ష వర్మ, దితిప్రియ రాయ్, సెజల్ మాండవియ, అంకుర్, ప్రిన్స్, హన్సి శ్రినివాస్తవ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

యూనిక్యూక్ పిక్చర్స్ బ్యానర్ పై    నరసింహులు, ఎస్ రమేష్ లు ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. ఈ సంద్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మా 4Girls సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో , Bcineet , ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్ , హుంగామ ప్లే , టాటా ప్లే బింగ్, వాచో , Vewd, క్లౌడ్ వాకర్, జీసన్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, అన్ని స్మార్ట్ టీవీ డివైసెస్, బ్రాడ్ బ్యాండ్ డివైసెస్, స్మార్ట్ స్టిక్ డివైసెస్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి అన్ని ఓటిటి లలో మంచి రెస్పాన్స్ వస్తుంది’..  మా సంస్థ నుండి మెసేజ్ ఓరియెంటెడ్ , క్రైమ్ , రివెంజ్, థ్రిల్లర్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది.  ప్రస్తుతం సినిమా అన్ని భాషల ట్రైలర్స్ , వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజైన రోజు నుండి ట్రెండింగ్ లో ఉన్నాయని మేకర్స్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.