Sanju Samson: వరుసగా రెండో హాఫ్ సెంచరీ.. ధోని రికార్డ్ బ్రేక్ చేసిన శాంసన్
Sanju Samson knockout record: సూపర్-8 దశలో వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు కీలక విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్‌గా నిలిచింది. ఇప్పుడు అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్‌లో కూడా వేగంగా అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను టీమ్‌కు మరోసారి బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

Sanju Samson knockout record: టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) మరోసారి మెరిశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సంజూ శాంసన్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించి టీమ్ ఇండియాకు బలమైన ఆరంభాన్ని అందించాడు. ముంబైలోని వాంఖడే (Wankhede Stadium) లో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో అతను ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు.
వెస్టిండీస్ మ్యాచ్ తర్వాత మరో అద్భుత ఇన్నింగ్స్..
సూపర్-8 దశలో వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌కు కీలక విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో అతని ఇన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్‌గా నిలిచింది. ఇప్పుడు అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్‌లో కూడా వేగంగా అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను టీమ్‌కు మరోసారి బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
జోఫ్రా ఆర్చర్‌పై దూకుడు..
ఇంగ్లాండ్ వేగ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) పవర్‌ప్లేలో సంజూ సామ్‌సన్‌ను పరీక్షించనున్నాడని భావించారు. కానీ సంజూ దూకుడుగా బ్యాటింగ్ చేసి ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేయలేకపోయిన ఆర్చర్‌పై సంజూ భారీ షాట్లు ఆడాడు.
ఒక దశలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) సులభమైన క్యాచ్‌ను వదిలేయడంతో సంజూకు ఒక లైఫ్ కూడా లభించింది.
పవర్‌ప్లేలో అద్భుత స్ట్రైక్ రేట్..
పవర్‌ప్లేలో కనీసం 100 పరుగులు చేసిన బ్యాటర్లలో సంజూ స్ట్రైక్ రేట్ 198.21గా ఉంది. ఇది టోర్నమెంట్‌లో రెండో అత్యుత్తమ రికార్డు.
ఈ జాబితాలో ఫిన్ ఆలెన్ (Finn Allen) మాత్రమే 204.65 స్ట్రైక్ రేట్‌తో అతని కంటే ముందున్నాడు.
ధోనీ రికార్డు బద్దలు..
ఈ ఇన్నింగ్స్‌తో సంజూ మరో ప్రత్యేక రికార్డు కూడా సృష్టించాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో భారత వికెట్‌కీపర్ చేసిన అత్యధిక స్కోర్ రికార్డును అతను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
ఇది వరకు ఈ రికార్డు ధోని (MS Dhoni) పేరిట ఉండేది. ధోనీ 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై 36 పరుగులు చేశారు. ఇప్పుడు సంజూ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.
