OTT Movie: డాక్టర్ ముసుగులో లేడీ కిల్లర్ అరాచకాలు.. OTTలో ఈక్రైమ్ థ్రిల్లర్ చూశారా? IMDBలోనూ టాప్ రేటింగ్
ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. డాక్టర్ వృత్తిలో ఉంటూ నీచమైన పనులకు పాల్పడే ఒక మహిళ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీకి ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రజెంట్ మూవీ ట్రెండ్ ఏదంటే.. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే. దాదాపు అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకైతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓటీటీలో ఈ మాలీవుడ్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. చాలా రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే వివిధ కారణాలతో ఓటీటీకి రావడానికి ఆలస్యమైంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ కు మంచి రెస్పాన్సే వస్తోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందజేస్తున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అవయవాల అక్రమ రవాణాకు పాల్పడే ఒక లేడీ డాక్టర్ చుట్టూ మీ మూవీ తిరుగుతుంది. తాను చేస్తున్న తప్పుడు పనుల కోసం దివ్యాంగుడైన ఒక టాక్సీ డ్రైవర్ ను ఉపయోగించుకుంటూ ఉంటుంది. అయితే ఒక సందర్భంలో ఆ లేడీ డాక్టర్ గుట్టురట్టవుతుంది. మరో ముఠాకి తాను దొరికిపోయే సమయం రాగానే, ఆ టాక్సీ డ్రైవర్ ను ఇరికిస్తుంది. మరి ప్రమాదకరమైన ఆ గ్యాంగ్ ను, దివ్యాంగుడైన ఆ టాక్సీ డ్రైవర్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు అంధకార. వాసుదేవ్ సనల్ తెరకెక్కించిన ఈ మూవీలో మంగళవారం మూవీ ఫేమ్ దివ్య పిళ్లై సీరియల్ కిల్లర్ గా నటించింది. చందునాథ్, ధీరజ్ డెన్నీ, ఆంథోనీ హెన్రీ, సుధీర్ కరమణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఐఎండీబీలో ఈ సినిమాకు సుమారు 7.8 రేటింగ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రజెంట్ ఈ మూవీ కేవలం ఒరిజినిల్ వెర్షన్ అంటే మలయాళం వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగులోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమాను, క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడేవారు చూడొచ్చు.
సన్ నెక్ట్స్ ఓటీటీ లో స్ట్రీమింగ్..
Trust nothing. Fear everything. Andhakaara will keep your heartbeat running.
Watch now on Sun NXT.
@vasudesanal @pillaidivya @thechandhunadh#Andhakaara #SuspenseMode #DarkVibes #SunNXT pic.twitter.com/SYVk6jzzsQ
— SUN NXT (@sunnxt) December 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




