AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : అప్పట్లో థియేటర్లలో వణుకు పుట్టించింది.. ఇప్పటికీ ఒంటరిగా చూడాలంటే భయమే.. ఈ సినిమా చూస్తే..

ఈ రోజుల్లో హారర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు తెగ ఇష్టపడతారు. ఇప్పటికే మీరు చాలా భయానక సినిమాలు చూసి ఉండవచ్చు. కానీ ఈరోజు మేము మీ ముందుకు తీసుకువచ్చిన సినిమా గురించి తెలిస్తే వణుకు పుడుతుంది. ఆ మూవీ పేరు మిమ్మల్ని భయాందోళనకు గురిచేస్తుంది. ప్రతి సీన్ మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసుకుందామా.

Cinema : అప్పట్లో థియేటర్లలో వణుకు పుట్టించింది.. ఇప్పటికీ ఒంటరిగా చూడాలంటే భయమే.. ఈ సినిమా చూస్తే..
Raat Movie
Rajitha Chanti
|

Updated on: Jan 02, 2026 | 9:54 PM

Share

90లలో అనేక భయానక చిత్రాల విడుదలయ్యాయి. తెలుగు, హిందీలో పలు హారర్ సినిమాలు భయం పుట్టించాయి. అందులో షైతానీ లక, వీరాన, ది హౌస్ నెక్స్ట్ డోర్, మహల్, దెయ్యం, పురానా మందిర్ ఉన్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులలో భయాన్ని కలిగించాయి. ఈరోజు మనం 1992లో విడుదలైన నిజంగా భయానక చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రంలోని దృశ్యాలు మిమ్మల్ని చాలా రాత్రులు వెంటాడుతూనే ఉంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూడాలంటే గుండెల్లో ఎంతో ధైర్యం ఉండాలి. ఆ సినిమా పేరు రాత్రి. 1992లో థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ అందరినీ భయపెట్టింది. ఈ చిత్రానికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

ఈ సినిమాలో వెంటాడే బీజీఎమ్, సీన్స్ అద్భుతంగా తెరకెక్కించి ఒక్కో సీన్ తో ప్రేక్షకులను భయపెట్టించాడు డైరెక్టర్. ఈ చిత్రంలోని సన్నివేశాలు చాలా మందిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా చూసి నిద్రపోవడానికి భయపడ్డారు. ఇందులోని అతీంద్రియ దృశ్యాలు రాత్రిపూట మిమ్మల్ని మరింత భయపెడతాయి. ఇందులో రేవతి ప్రధాన పాత్రలో నటించారు. ఓం పూరి, ఆకాష్ ఖురానా, అనంత్ నాగ్ , తేజ్ సప్రూ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ1 కోటి, కానీ ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

1992లో వచ్చిన “రాత్రి” అనే హర్రర్ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.2 కోట్లు వసూలు చేసిన హారర్ సినిమా ఇది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్ లోనూ ఈ సినిమాను చూడొచ్చు.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..