Samantha: భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సమంత ఎంత సంతోషంగా ఉందో చూశారా? వీడియో ఇదిగో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తోందీ అందాల తార. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సామ్ 2026 నూతన సంవత్సర వేడుకలను విదేశీ గడ్డపై తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది

టాలీవుడ్ హీరోయిన్ సమంత గతేడాది రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఏడడుగులు వేసింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి సన్నిధి ఆలయంలో వీరి వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే సామ్- రాజ్ వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈ కొత్త జంట న్యూ ఇయర్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకోసం పోర్చుగల్ రాజధాని లిస్బన్ వెళ్లిన వీరు అక్కడే కొత్త ఏడాదికి గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. అయితే ఇందులో ఒక వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. సమంతతో కలిసి ఆమె భర్త రాజ్ నిడిమోరు కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వీడియో సామ్ నవ్వుతూ చాలా సంతోషంగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్, అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సమంతకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక సినిమాల పరంగానూ సామ్ బిజి బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేస్తోంది. అందులో మా ఇంటి బంగారం ఒకటి. సమంత నటించడంతో పాటు స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. దీంతో పాటు బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్- డీకే తెరకెక్కిస్తోన్న రక్త బ్రహ్మాండం అనే భారీ పీరియడికల్ వెబ్ సిరీస్ లోనూ సామ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమెతో పాటు ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి వంటి స్టార్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు.
భర్తతో కలిసి సమంత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వీడియో ఇదిగో..
Unplanned moments will be one of those nights where boundaries quietly disappeared ❤️😍
Samantha with her husband and frnds at a celebration 😍 Happy New Year🔥#Samantha pic.twitter.com/ykKy16Gre3
— Dhruv Arjun (@Dhruv_Arjunan) January 1, 2026
సామ్ డిసెంబర్ జ్ఞాపకాలు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




