Jockey Movie: ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ‘జాకీ’ సినిమా.. టీజర్ అద్దిరిపోయిందిగా..
పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజైన ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదేదో డిఫరెంట్ మూవీలా ఉందనిపించింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ కాగా అంచనాలు మరింత పెరిగాయి.

పీకే 7 స్టూడియోస్ నిర్మిస్తున్న కొత్త తమిళ సినిమా ‘జాకీ ’ టీజర్ విడుదలైంది. ఈ సినిమా మధురై గ్రామీణ నేపథ్యంలో రూపొందింది. చెన్నైలో జరిగిన వీధి తిరువిళా – 13వ ఎడిషన్ కార్యక్రమంలో టీజర్‌ను విడుదల చేశారు. 2021లో వచ్చిన ‘మడ్డి’ సినిమా తర్వాత, PK7 స్టూడియోస్ మరోసారి దర్శకుడు డా. ప్రగభల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.ప్రేమ కృష్ణదాస్ – సి దేవదాస్ & జయ దేవదాస్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. శక్తి బాలాజీ ఈ సినిమా కి సంగీతం అందించారు. మధురై నేపథ్యంలో సాగే ‘జాకీ’ కథ గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ పోరాట సన్నివేశాలు అన్ని సహజం గా తెరకెక్కించడానికి ఒక మూడు సంవత్సరాలు ఆ ప్రాంతంలో సినీ బృందము చాలా కృషి చేసి నేటివిటీ మిస్ అవ్వకుండా ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు.
నటీనటులు నిజమైన పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించారు. ‘జాకీ’ సినిమా ద్వారా గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను సహజంగా ప్రేక్షకులకు చూపించనున్నారు. టీజర్ విడుదలతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.
విజయ్ సేతుపతి చేతుల మీదుగా టీజర్..
JOCKEY OFFICIAL TEASER (TELUGU) From the makers of MUDDY comes something the Indian screen has never witnessed before.
For the first time, witness the intense pride and power of Tamil Nadu traditional cultural goat fight — a sport never captured on film. Adrenaline-packed… pic.twitter.com/w6V46q05Z5
— PK7 Studios (@pk7studios) January 3, 2026
జాకీ సినిమా టీజర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




