Portable AC Benefits: సామాన్యులకు బెస్ట్ ఆప్షన్.. పోర్టబుల్ ఏసీ కొంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Portable AC Benefits: సాధారణంగా వేసవిలో ఏసీ ఇన్ స్టాలేషన్ చేసే వారికి భారీగా డిమాండ్ ఉంటుంది. మీరు ఏసీ కొన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇన్ స్టాలేషన్ కోసం ఎదురుచూడాల్సి రావచ్చు. అదే పోర్టబుల్ ఏసీని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వినియోగించవచ్చు..

Portable AC Benefits: ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. ఎండలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. అయితే మార్కెట్లో రకరకాల ఏసీలు లభ్యవుతున్నాయి. ఏసీలలో కూడా రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకటి గోడకు తగిలించేది (Split ACs) అయితే.. రెండోది తేలిగ్గా తరలించగలిగే ఏసీలు (Portable ACs). కొందరిలో స్ప్లిట్ ఏసీల విషయంలో ఉన్న క్లారిటీ.. పోర్టబుల్ వాటికి వచ్చేసరికి ఉండటం లేదు. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్లకు అవి సరిగ్గా సరిపోతాయా? లేవా? అన్న సందేహం వస్తుంటుంది. ఈ నేపథ్యంలో పోర్టబుల్ ఎయిర్ కండీషనర్లను (Portable ACs) కొనుగోలు చేయడం వల్ల కలిగే ఆరు ప్రధాన లాభాలు ఏంటో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ రూ.3 లక్షలకు చేరిన వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు:
ఈ ఏసీలకు కింది భాగంలో చక్రాలు ఉండటం వల్ల వీటిని ఎక్కడకైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటాయి. ఈ ఏసీలను ఒక గది నుంచి మరో గదికి తెలిగ్గా తీసుకెళ్లవచ్చు. మీరు పగలు హాల్‌లో ఉన్నా, రాత్రి పడకగదికి వెళ్లినా, ఈ ఏసీని మీతో పాటే తీసుకెళ్లవచ్చు.
సులభమైన ఇన్‌స్టాలేషన్:
అలాగే స్ప్లిట్ ఏసీల మాదిరిగా గోడలకు రంధ్రాలు చేయడం లేదా బయటి వైపు యూనిట్లను అమర్చాల్సిన అవసరం ఉండదు. కిటికీ ద్వారా వేడి గాలిని బయటకు పంపే పైపును అమర్చుకుంటే సరిపోతుంది. దీనికి సాధారణంగా టెక్నీషియన్ల సహాయం కూడా అవసరం లేదు. ఫలితంగా మీరే దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని వల్ల ఖర్చులను కూడా ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా టెక్నీషియన్స్‌ను పిలిపించి ఇన్‌స్టాల్ చేయిస్తే వేలల్లో ఖర్చువుతుంది.
అద్దె ఇళ్లల్లో ఉండేవారికి బెటర్:
ఇక చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటుంటారు. అలాంటి వారికి ఏసీను ఇన్‌స్టాల్ చేసుకోవడం పెద్ద సమస్య. పైగా ఇన్‌స్టాల్ కోసం ఖర్చుల మోత. మధ్యతరగతి చెందినవారిలో ఎక్కువ మంది అద్దె ఇళ్లల్లోనే జీవిస్తుంటారు. అందుకు ఇళ్లు మారుతున్న సమయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే ఇలాంటి ఏసీలు ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇళ్లు మారినా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కూలింగ్:
సాధారణంగా వేసవిలో ఏసీ ఇన్ స్టాలేషన్ చేసే వారికి భారీగా డిమాండ్ ఉంటుంది. మీరు ఏసీ కొన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇన్ స్టాలేషన్ కోసం ఎదురుచూడాల్సి రావచ్చు. అదే పోర్టబుల్ ఏసీని ఇంటికి తీసుకొచ్చిన వెంటనే వినియోగించవచ్చు. తక్షణమే ఇవి కూలింగ్ ను అందిస్తాయి.
చిన్న గదులోనైనా వినియోగించవచ్చు:
ఇక ముఖ్యంగా అద్దె ఇళ్లల్లో ఉండేవారి గదులు చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి వారికి ఈ పోర్టబుల్ ఏసీలు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. దీని వల్ల స్థలం ఆదా అవుతుంది. చిన్న గదుల్లోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని పక్కకు జరిపి స్టోర్ రూమ్‌లో కూడా పెట్టుకోవచ్చు.
వర్షాకాలంలోనూ వాడొచ్చు:
చాలా పోర్టబుల్ ఏసీలలో కూలింగ్‌తో పాటు గాలిలోని తేమను తొలగించే ‘డీహ్యూమిడిఫైయర్’ (Dehumidifier) ఫీచర్ ఉంటుంది. వర్షాకాలంలో గదిలో వచ్చే ఉక్కపోత, తేమను తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
