అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ప్రముఖ నటి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వింతగా ప్రవర్తించారు. పూనకంతో ఊగిపోయిన ఆమె పక్కనున్న తోటి భక్తులను కొరికేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె గురించి బాగానే పరిచయం ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్ తో నటించారీ అందాల తార. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె తన క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా మయూరి అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి మెప్పించడం విశేషం. ఇప్పటికీ నాగిన్ వంటి సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోందీ అందాల తార. ఈ క్రమంలో నటి సుధా చంద్రన్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఓ భజన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పూర్తిగా ఆధ్యాత్మిక భావనలో మునిగిపోయారు. ఇదే సమయంలో ఆమె వింతగా ప్రవర్తించారు.
ఈ సందర్భంగా ఎరుపు, తెలుపు రంగు చీర ధరించి, నుదట ‘జై మాతా జీ’ అని రాసి ఉన్న బ్యాండ్ కట్టుకున్న సుధా చంద్రన్ ఒక్కసారిగా పూనకం ఊగిపోయారు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో తనను పట్టుకోవడానికి వచ్చిన ఒక భక్తుడి చేతిని ఆమె బలంగా కొరికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.అదే సమయంలో ఆమె ప్రవర్తనను చూసి భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘సుధా చంద్రన్ ఏదో మానసిక వేదనలో ఉన్నారు. అందుకే ఆమె ఇలా ప్రవర్తించి ఉండచ్చేమో.. రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయినా కృత్రిమ కాలితో నృత్యం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. భక్తి పారవశ్యంలో పూర్తిగా మునిగిపోయినట్లున్నారు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో ఇదిగో..
TV actress Sudha Chandran looks disturbed at Mata Ki Chowki; viral video sparks concern and debate online. Netizens react.#SudhaChandran #ViralVideo #TVNews #MataKiChowki pic.twitter.com/6XtEJxNRBt
— Thegossipgully.com (@thegossipgully) January 4, 2026
కాగా ఇప్పటికీ పలు తెలుగు, హిందీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు సుధా చంద్రన్. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




