The Raja Saab: ‘ది రాజాసాబ్’ హీరోయిన్ తన ఫొన్‌లో ప్రభాస్ నంబర్‌ను పేరుతో సేవ్ చేసుకుందో తెలుసా?
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ విడుదలకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కామెడీ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 09న గ్రాండ్ గా విడుదల కానుంది.

ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాంటసీ, హారర్, కామెడీ, రొమాన్స్, ఫన్. .ఇలా అన్నీ అంశాలు కలిసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్గుగానే ది రాజాసాబ్ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. రాధే శ్యామ్ తర్వాత రెండో సారి డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోది రిద్ధి కుమార్. ఇక ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఈ ముద్దుగుమ్మే హైలెట్ గా నిలిచింది. ఈ ఈవెంట్ లో ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ అందాల తార. మూడు సంవత్సరాల క్రితం ప్రభాస్ తనకు ఒక చీరను బహుమతిగా ఇచ్చారని, అది తన జీవితంలో ఎంతో ప్రత్యేకమంది రిద్ధి కుమార్. ఇప్పటికీ ఆ చీరను ఎంతో ప్రేమగా దాచుకుని, అదే చీరను ఈ ఈవెంట్‌కు కట్టుకుని వచ్చానని ప్రభాస్ అభిమానుల మనసులు గెల్చుకుందీ క్రేజీ హీరోయిన్.
ఇదిలాఉంటే ది రాజాసాబ్ ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటోంది రిద్ది కుమార్. టీవీ ఛానెల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్, ది రాజా సాబ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ‘మీ దగ్గర ప్రభాస్ ఫోన్ నెంబర్ ఉందా’ అని రిద్ది కుమార్ ను అడగ్గా.. ‘అవును, ఉంది’ అని ఆమె సమాధానం చెప్పింది. ఆ నెంబర్‌ను ఫోన్‌లో ఎలా ఫీడ్ చేసుకున్నారు అని అడిగితే, ‘ప్రభాస్ అనే పేరుతోనే సేవ్ చేసుకున్నాను’ అని చెప్పిందీ ముద్దుగుమ్మ.
దీంతో పాటు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ అందాల తార. ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ సమయంలో తన నటనను ప్రభాస్ ఎంతో మెచ్చుకున్నారని, తన పర్ఫార్మెన్స్‌పై ఆయన చెప్పిన మాటలు తనకు చాలా ధైర్యం ఇచ్చాయని తెలిపింది. అదే నమ్మకంతో ‘ది రాజా సాబ్’ సినిమాలో అవకాశం వచ్చిందని మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.
ప్రభాస్ తో రిద్ది కుమార్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




