Khaidi Movie: మరో హీరోయిన్ దొరికేసింది.. ‘ఖైదీ’లో కార్తీ కూతురు ఇప్పుడెలా మారిపోయిందా చూశారా? ఫొటోస్ వైరల్
లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో కార్తీ నటించిన సినిమా ఖైదీ. 2019లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో కార్తీకి ఓ కూతురు కూడా ఉంటుంది. మరి ఆ పాప ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

లోకేశ్ కనగరాజ్ ను స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా ఖైదీ. అలాగే హీరో కార్తీ కెరీర్ లోనూ మరపురాని చిత్రంగా ఈ ఖైదీ నిలిచిపోయింది. 2019లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలను ఆధారంగా తీసుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు లోకేశ్. ఈ ఖైదీ సినిమాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఈ మూవీ టీవీలో వస్తుంటే ఛానెల్ మార్చుకుండా చూసే వారు చాలామందే ఉన్నారు. ఈ ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో కార్తీతో పాటు నరైన్, అర్జున్ దాస్, హరీశ్ ఉత్తమన్, జార్జి మరియన్, దీనా, హరీశ్ పేరడి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇదే ఖైదీ సినిమాలో కార్తీకి ఓ కూతురు కూడా ఉంటుంది. తండ్రి జైలుకు వెళ్లడంతో ఆమె ఓ అనాథాశ్రయంలో పెరుగుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో కార్తీ తో సమానంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఖైదీ సినిమాలో నటించిన ఛైల్డ్ ఆర్టిస్ట్ పేరు మోనికా శివ. కార్తీతో పాటు విజయ్, అజిత్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో కలిసి పలు సినిమాల్లో బాలనటిగా చేసింది. అలాగే లోకేశ్ కనగరాజ్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ‘విక్రమ్’ క్లైమాక్స్‌లోనూ కాసేపు అలా కనిపించింది. ఖైదీ సినిమాలో నటించే సమయానికి మోనిక వయసు 11 ఏళ్లు. ఖైదీ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తి అయ్యింది. ఈ ఆరేళ్లలో ఆ పాప పెరిగి పెద్దది అయ్యింది. ఇప్పుడు గుర్తుపట్టలేని రేంజ్ లో ఉంది. ప్రస్తుతం మోనిక ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికేసిందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మోనిక శివ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
కాగా ఖైదీకి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ తెరకెక్కనుంది. మరి ఇందులో మోనిక నటిస్తుందో! లేదో! క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో ఈ క్యూటీ సినిమాలు చేస్తుందేమో చూడాలి మరి.
మోనిక శివ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




