The Raja Saab: ఇంటర్వ్యూ పుణ్యమాని మరో లీక్ !! పార్ట్2 పై లీకిచ్చిన మారుతీ
సినిమా ప్రమోషన్స్‌లో సోషల్ మీడియా ఇంటర్వ్యూలు లీకులకు దారితీస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, మారుతి పొరపాటున 'రాజాసాబ్ పార్ట్ 2' ఉంటుందని వెల్లడించారు. ట్రైలర్‌లోని జోకర్ గెటప్ పార్ట్ 2కి లీడ్ అని తెలిపారు. ఈ లీక్ ఫిల్మ్ లవర్స్‌ను నిరాశపరచగా, ప్రభాస్ అభిమానులు మాత్రం సంతోషిస్తున్నారు.
ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ అంటే పోస్టర్లు.. టీవీలో యాడ్‌లు..! కానీ ఇప్పుడు సినిమా ప్రమోషన్ అంటే.. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఇంటర్వ్యూలు..! అయితే ఈ ఇంటర్వ్యూలతో సినిమా ప్రమోషన్ జరగమనేది అటుంచితే.. లీకులు మాత్రం దండిగా బయటికి వస్తున్నాయి. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని కొంత వరకు కిల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా మారుతీ నోటి నుంచి వచ్చిన ఓ విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో మారుతీ తెరకెక్కించిన హార్రర్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాజాసాబ్. సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. దీంతో తన సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు డైరెక్టర్ మారుతీ వరుసగా ఇంటర్వ్యూలిస్తూ పోతున్నాడు. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా… రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందంటూ లీకిచ్చాడు. అంతేకాదు రాజాసాబ్ ట్రైలర్‌లో చివర్లో.. జోకర్ గెటప్‌లో ప్రభాస్ కనిపించిన షార్ట్స్.. రాజాసాబ్ పార్ట్ 2కు లీడ్ అంటూ నోరు జారాడు డైరెక్టర్ మారుతీ.దీంతో ఫిల్మ్ లవర్లు.. ఈ లీక్ పై ఫీలవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం రాజాసాబ్ 2పై ఫుల్ ఖుషీ అవుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా ?? పెళ్లి చేసుకుంటే సరిపోదు.. కలిసి ఉండాల్సిందే
మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300
వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

