AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300

మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300

Phani CH
|

Updated on: Jan 05, 2026 | 7:55 PM

Share

సుదూర ప్రయాణికులకు వందేభారత్ స్లీపర్ రైళ్లు శుభవార్త. కోల్‌కతా-గువాహటి మధ్య త్వరలో ప్రారంభం కానున్న ఈ రైళ్లు విమాన టిక్కెట్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకొని ధరలు నిర్ణయించారు. గంటకు 180 కి.మీ. వేగంతో అధునాతన సదుపాయాలతో నడిచే ఈ రైళ్లు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడించారు.

సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. తొలి రైలు కోల్‌కతా- గువాహటిల మధ్య ప్రధాని మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుంది. బెంగాల్‌- అస్సాం మధ్య నడిచే ఈ రైలు టికెట్‌ ధరలు.. విమాన టికెట్‌ ధరల కంటే తక్కువ. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ ప్రకటన చేసారు. జనవరి 18, 19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి 8 వేలు ఖర్చవుతోంది. వందేభారత్‌ స్లీపర్‌లో 3rd ఏసీ టికెట్‌ ధర ఫుడ్‌తో కలిపి సుమారు రూ.2,300, 2nd ఏసీ ధర సుమారు రూ. 3 వేలు, 1ఏసీ ధర సుమారు రూ.3,600 ఉంటుంది. మధ్యతరగతిని దృష్టిలోపెట్టుకొని టికెట్‌ ధరలు నిర్ణయించినట్లు మంత్రి. ఈ ఏడాది అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. కోటా నుంచి నాగ్దా మధ్య ఫైనల్‌ పరీక్ష నిర్వహించగా ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్లో ఉంచినా.. గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తొణకకపోవడాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పోస్ట్‌ చేసారు. ఈ రైల్లో 16 బోగీలుంటాయి. వీటిలో ఆకర్షణీయమైన ఏసీ స్లీపర్‌ బెర్తులు, అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు

గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం

బీచ్‌లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా

ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా