బీచ్‌లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా
విశాఖపట్నం, ఋషికొండ తీరంలో మత్స్యకారులకు అరుదైన "కాలిమొయి" లేదా స్పాటెడ్ మోరే ఈల్ చేప లభించింది. దాదాపు 5 మీటర్ల పొడవు, చిరుతపులి చారలతో ఆకర్షణీయంగా కనిపించే ఈ లోతైన సముద్ర చేప, దురదృష్టవశాత్తు నిర్జీవంగా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీని పదునైన దంతాలు, రాళ్ల మధ్య ఆవాసం, రాత్రిపూట ఆహార అన్వేషణ వంటి ప్రత్యేకతలను సముద్ర పరిశోధకులు వెల్లడించారు.
సముద్రంలో ఎన్నో రకాల జీవరాసులుంటాయి. చేపలు, రొయ్యలు, నత్తలు, తాబేళ్ళు. ఇలా అనేక రకాల జీవులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటాయి. ఒక్కోసారి సముద్రంలో వచ్చే భారీ అలల కారణంగా అవి ఒడ్డుకు చేరుతుంటాయి. ఎన్నడూ చూడని, వింత ఆకారాల్లోని సముద్ర జీవులు సముద్రం ఒడ్డున కనిపించినప్పుడు స్థానికులు, మత్స్యకారుల ఆశ్చర్యపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ తీరంలో వెలుగు చూసింది. ఒక వింత చేప సమద్రతీరంలో దర్శనమిచ్చింది. విశాఖలోని ఋషికొండ తీర ప్రాంతంలో మత్స్యకారులకు అరుదైన చేప జాతికి చెందిన ప్రాణి చిక్కింది. శరీరంపై విభిన్నమైన చారలున్న ఆ చేప ప్రత్యేకంగా కనిపించింది. అయితే విషాదం ఏంటంటే.. ఈ చేప తీరానికి చేరేలోపే నిర్జీవంగా మారింది. స్పాటెడ్ మోరే ఈల్స్.. గా పిలవబడే జాతికి చెందిన దీనిని మత్స్యకారులు కలిమొయి అని పిలుస్తారు. చూడ్డానికి ఈ చేప చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని శరీరంపై చిరుత పులి లాంటి చారలు కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువగా సముద్రంలో లోతైన ప్రాంతాల్లో ఉండే రాళ్ల మధ్య ఆవాసం ఏర్పరుచుకొని ఇవి జీవనం సాగిస్తాయి. ఈ కలిమొయి చేపకు పదునైన దంతాలు ఉంటాయి. ఇది దాదాపుగా 5 మీటర్ల పొడవు వరకు పెరుగుతుందని చెబుతున్నారు సముద్ర మత్స్య పరిశోధన శాస్త్రవేత్తలు. సముద్రం లోని లోతైన ప్రాంతంలో నివసించే ఈ చేపలు రాత్రిపూట ఎక్కువగా ఈ ఆహార అన్వేషణ చేస్తూ ఉంటాయని.. అయితే ఇవి వలకు చిక్కడం చాలా అరుదని అధికారులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా
ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో
ఈ ‘చిట్టి’ పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా
జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

