AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు ఉన్నాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానాలు ఆధారంగా ఈ యోగాలు ఏర్పడతాయి. యోగాలు ఆధారంగా శుభ యోగాలు, అశుభ యోగాలు వర్గీకరించబడతాయి. ఈ యోగాలు శుభాశుభ గ్రహాల స్థితి, గ్రహాల కలయిక, దృష్టి బట్టి ఏర్పడతాయి. ఆ తర్వాత, ఈ గ్రహాల బలం, యోగాల బలం ఆధారంగా, వాటి ఫలితాలు నిర్ణయించబడతాయి.

జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?
Shubh Yogas
Rajashekher G
|

Updated on: Jan 05, 2026 | 7:17 PM

Share

సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇక, జ్యోతిష్య శాస్త్రంలో అనేక యోగాలు ఉన్నాయి. రాశి, అంశ చక్రాలలో ఉన్న గ్రహస్థానలను బట్టి ఈ యోగాలు ఉంటాయి. యోగాలను అనుసరించి శుభ యోగాలను, అశుభయోగాలను వివరించారు. ఈ యోగాలు శుభాశుభ గ్రహములు తామున్న రాశుల స్థితి, గ్రహముల కలియిక, దృష్టిని బట్టి ఏర్పడతాయి. దాని వల్ల వాటి బలములను అనుసరించి యోగాల బలములు నిర్ణయించబడతాయి. ప్రధాన యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భాగ్య యోగము:

భాగ్య స్థానమును అనగా లగ్నం నుంచి 9వ ఇంట శుభ గ్రహము ఉన్నా లేదా శుభ గ్రహం చూసినా.. ఆ భాగ్యధిపతి తన స్వ, మిత్ర, ఉచ్చ స్తానములో ఉన్నా కూడా ఈ భాగ్య యోగం కలుగుతుంది. ఈ యోగమున జన్మించిన వాడు శాశ్వత ఐశ్వర్యవంతుడు, రాజ పూజితుడు, ధర్మ మార్గపరుడు స్వకులాచార తత్పరుడు వంటి శుభ గుణములు కలిగివుంటాడు.

పారిజాత యోగము:

జాతకంలో లగ్నం నుంచి 11వ స్థానంలో శుభగ్రహం ఉన్నప్పుడు, ఆ గ్రహం లాభప్రదం అవుతుంది. అలాగే, లాభాధిపతి (11వ భవం అధిపతి) స్వ, మిత్ర లేదా ఉచ్చస్థితి గ్రహంగా ఉంటే, ఈ లాభయోగం ఏర్పడుతుంది. విపరీత రాజయోగం అనే ఈ యోగం చాలా అరుదుగా జాతకాలలో కనిపిస్తుంది. ఈ యోగం ఏర్పడేందుకు, లగ్నాధిపతి, రాశ్యాధిపతి మధ్య సంబంధం ఉండాలి. లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి, ఆ రాశ్యాధిపతి ఉన్న లగ్నాధిపతి, లేదా లగ్నాధిపతి ఉన్న రాశ్యాధిపతి ఉచ్చస్థితి, దిగ్బలము పొంది, కేంద్రము లేదా కోణంలో ఉండాలి. ఈ యోగం కలిగిన జాతకులు బాల్యంలో సాధారణ జీవితాన్ని ప్రారంభించి, మధ్య వయసు నుంచి మరింత గౌరవం, ప్రభువుల సహాయం, ధనికులతో పరిచయాలు ఏర్పడతాయి. వీరు ధన, వాహనాలు, ప్రభావశాలి కీర్తి కలిగి ఉంటారు.

త్రిలోచన యోగము:

త్రిలోచనయోగంలో ఆయుర్దాయం, శత్రువులపై విజయం, సంపద, కీర్తి, మేధాశక్తి వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ యోగం ఏర్పడిన జాతకుల జీవితాలు తేలికగా, ఏ కష్టాలు లేకుండా సాగుతాయి. రవి, చంద్ర, కుజులు ఒకరినొకరు కోణముల లో ఉంటే, వారి జీవితంలో ఏ విధమైన అడ్డంకులు ఉండవు. ఇది ఒక శుభ యోగం.

ఖ్యాతి యోగము:

లగ్నం నుంచి దశమస్థానం లో శుభగ్రహం ఉంటే, ఆ గ్రహం దశమాధిపతికి స్వ/మిత్ర/ఉచ్చ స్థానంలో ఉంటే, ఖ్యాతి యోగం ఏర్పడుతుంది. ఈ జాతకులు ధన, మిత్ర, సతీ, సుతులతో పాటు ప్రజాదరణ, కీర్తి, ప్రతిష్ఠ పొందుతారు.

గజకేసరి యోగము:

గురుడు లగ్నం నుంచి లేదా చంద్రుని నుంచి కేంద్రంలో ఉంటే, అది గజకేసరి యోగం అని పిలుస్తుంది. ఈ యోగం ఉండడానికి గురుడు నీచస్థితి లేదా అస్తంగత స్థానంలో ఉండకూడదు. అదేవిధంగా, శత్రు క్షేత్ర స్థితి కూడా ఉండకూడదు. గురుడు మరో శుభగ్రహం గాని, వీక్షణ గానీ పొంది ఉండాలి. ఈ యోగం ఏర్పడితే, జాతకులకు శుభ ఫలితాలు లభిస్తాయి. గురుడు, చంద్రుని సమన్వయంతో ఈ యోగం ఏర్పడుతుంది. చంద్రుని నుంచి గురుడు కేంద్రాలలో ఉన్నప్పుడు (4, 7, 10 స్థానాలలో) ఈ యోగం మరింత శక్తివంతంగా ఉంటుంది. 7, 10 స్థానాలలో ఈ యోగం మరింత ప్రభావితం చేస్తుంది. ఈ యోగం కలిగిన వ్యక్తులు సభ్యత, ఉదారత, సంపద, దానగుణం, మరియు ఉన్నతాధికారము వంటి సకల శుభ లక్షణాలను కలిగి ఉంటారు. గురుడు, చంద్రుడు బలంగా ఉంటే, ఈ జాతకులు ధన, కీర్తిలో ప్రత్యేకమైన స్థాయిని చేరుకుంటారు.

ముఖ్యమైన విషయాలు: ఈ యోగాలలోని సర్వ శుభాలు కనిపించడానికి, ఆ గ్రహాలకు అస్తంగత దోషం లేకుండా, షడ్బలము, దిగ్మలము ఉండాలి. షడ్బలము, దిగ్బలము కలిగిన గ్రహాలు ఈ యోగం పూర్తి ఫలితాలను అందిస్తాయి.

Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.