AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

జనవరి నెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడ నుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కలయిక లేదా గ్రహాలు రాశి సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే జనవరి నెలలో ధనస్సు రాశిలోకి సూర్య గ్రహ సంచారం, బుధుడి సంయోగం వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఇది 12 రాశులపైన ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 05, 2026 | 5:36 PM

Share
బుధాదిత్య రాజయోగం వలన కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరితే, మరికొన్ని రాశుల వారికి ఉద్యోగ మార్పు, ఆకస్మిక ప్రయాణాల వలన లాభం పొందడం వంటివి జరుగుతుంది. కొన్ని రాశుల వారి జీవితంలో ఇది కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ముఖ్యంగా చాలా రోజుల నుంచి వివాహా ప్రయత్నాలు చేసే వారు ఈ సమయంలో ఆ ప్రయత్నం ఫలించే ఛాన్స్ ఉన్నది.

1 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లభించడంతో, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.

2 / 5
వృషభ రాశి : వృషభరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మొత్తం వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది. ఆదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం బాగుంటుంది. విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారి కోరిక నెరవేరుతుంది. ఆనందకరంగా గడిచిపోతుంది

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గతంలో రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి జనవరి నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా బుధాదిత్య రాజయోగం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఆదాయ మార్గాలను తెచ్చిపెడుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది

5 / 5