AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం

2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం

Phani CH
|

Updated on: Jan 05, 2026 | 7:44 PM

Share

నోస్ట్రడామస్ 2026 అంచనాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం, ఆర్థిక సంక్షోభం, తీవ్ర పర్యావరణ మార్పులు, AI నియంత్రణ వంటి భయానక పరిణామాలు ఉండబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. అణు దాడి, ఆహార కొరత కూడా సంభవిస్తాయని హెచ్చరించారు. ఈ అంచనాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నోస్ట్రడామస్ 2026కి సంబంధించి చేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా అందరిలో వణుకుపుట్టిస్తున్నాయి. పరిణామాలు భయానకంగా ఉండబోతున్నాయనీ విపత్తుల ముంచుకొస్తున్నాయని నోస్ట్రడామస్ అంచనా వేసారు. 2026 మధ్యకాలం నాటికి మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై వినాశకరంగా మారుతుందని మతం, జాతీయవాదం పేరుతో జనం ఒకరినొకరు చంపుకుంటారని అంచనా వేసారు. ఇప్పటికే తూర్పు దేశాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం. 2026లో జరిగే సముద్ర యుద్ధం ప్రపంచాన్ని కుదిపేయనుంది. ఒక భారీ నౌక మునగడంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత పెరిగి, అగ్రరాజ్యాల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు. సముద్రంలో నౌక మునిగిన రోజున యుద్ధం ప్రపంచ రాజకీయాల గమనాన్ని మారుస్తుందని నోస్ట్రడామస్ తన పద్యాలలో తెలిపారు. 2026లో అమెరికా, బ్రిటన్ దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఫలితంగా ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగి సామాజిక అశాంతికి దారితీయవచ్చని అంచనా వేసారు. పెరిగే ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలువురు అగ్రనేతల పదవులు చేజారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పర్యావరణ పరంగా కూడా 2026 ప్రమాదకరంగా ఉండబోతోందట. తీవ్రమైన ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలను ఎడారులుగా మారుస్తాయి. కుండపోత వర్షాలతో వరదలు సంభవిస్తాయి. సముద్ర మట్టాలు పెరగడం వల్ల పర్యావరణానికి, మానవజాతికి అపార నష్టం వాటిల్లుతుందని ఫ్రెంచ్ జ్యోతిష్కుడు అంచనా వేసారు. సాంకేతిక రంగంలో కీలక మార్పులను ఆయన ముందే ఊహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహాదారుగా మాత్రమే కాకుండా, నిర్ణయాధికార స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ప్రభుత్వాలు, అన్ని వ్యవస్థలు ఏఐ నియంత్రణలో నడిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. మరో భయానక అంచనా 2026లో అణు దాడికి అవకాశం ఉండటం. ఒక ప్రముఖ దేశం అణు దాడికి సిద్ధమవుతుందని దీంతో ‘భూమి’పై చీకట్లు కమ్ముకుంటాయని హెచ్చరించారు. నోస్ట్రడామస్ అంచనాల్లో గోధుమలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నోస్ట్రడామస్ చెప్పిన ఈ అంచనాలు చాలా వరకు అస్పష్టంగా ఉన్నాయనీ, వీటిని ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే నోస్ట్రడామస్ అంచనాలకు దగ్గరగా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీచ్‌లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా

ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా

ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో

ఈ ‘చిట్టి’ పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?