AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 'చిట్టి' పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

ఈ ‘చిట్టి’ పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

Phani CH
|

Updated on: Jan 05, 2026 | 7:20 PM

Share

అమూర్ ఫాల్కన్లు మణిపూర్ నుండి ఆఫ్రికాకు అద్భుత వలసను పూర్తిచేశాయి. 'అపాపాంగ్' 6,100 కి.మీ. దూరం 6 రోజుల్లో ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించింది. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ పర్యవేక్షణలో, ఈ చిన్న పక్షులు ఖండాలను దాటాయి. ఒకప్పుడు వేటాడిన మణిపూర్ ప్రజలు ఇప్పుడు వాటి సంరక్షకులుగా మారడం ఈ విజయగాథలో మరో విశేషం. ఇది వలస మార్గాల పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ప్రపంచంలోనే సాహస వలస పక్షులుగా పేరున్న ‘అమూర్ ఫాల్కన్లు’ మరోసారి అద్భుతం చేశాయి. మణిపూర్ నుంచి బయలుదేరిన మూడు చిన్న పక్షులు.. అపాపాంగ్, అలంగ్, అహు వేల కిలోమీటర్ల దూరాన్ని అత్యంత వేగంగా అధిగమించి ఆఫ్రికా ఖండానికి చేరుకున్నాయి. క్రిస్మస్ వెలుగులతో జింబాబ్వే రాజధాని హరారే నగరం మెరుస్తుంటే ఆ నగరం మీదుగా ఈ చిట్టి అతిథులు ప్రస్తుతం విహరిస్తున్నాయి. శాటిలైట్ ట్యాగ్ ఉన్న ‘అపాపాంగ్’ అనే మగ పక్షి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది నవంబర్‌లో కేవలం 6 రోజుల్లోనే 6,100 కిలోమీటర్ల దూరాన్ని ఏకధాటిగా ప్రయాణించింది. అరేబియా సముద్రాన్ని, హార్న్ ఆఫ్ ఆఫ్రికాను దాటి నేరుగా కెన్యాలో వాలింది. ఇంత చిన్న పక్షి బరువు దాదాపు 150 గ్రాములు. అలాంటిది ఇది ఆగకుండా ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేయడం ఒక ప్రపంచ రికార్డు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆడపక్షి’అలంగ్’ 5,600 కిలోమీటర్ల ప్రయాణంలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్రలో స్వల్ప విరామం తీసుకుని కెన్యా చేరింది. మరో పక్షి ‘అహు’ బంగ్లాదేశ్ మీదుగా 5,100 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియా చేరుకుంది. వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త సురేశ్ కుమార్, ఐఏఎస్ అధికారిణి సుప్రియ సాహు ఈ పక్షుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఖండాలను కలిపే ఈ వలస మార్గాల పరిరక్షణ ఎంత ముఖ్యమో ఈ పక్షుల ప్రయాణం మనకు గుర్తుచేస్తోంది. ఒకప్పుడు ఈ పక్షులను వేటాడే మణిపూర్, నాగాలాండ్ ప్రజలు.. ఇప్పుడు వాటిని సంరక్షిస్తూ ‘రక్షకులు’గా మారడం ఈ విజయగాథలో మరో విశేషం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జ్యోతిష్య శాస్త్రంలో శుభయోగాలు ఇవే.. ఏ యోగానికి ఏ ఫలితమో తెలుసా?

నిద్రలో గొంతును నులిమింది ఎవరు.. అది దెయ్యం పనేనా

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో

రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??

మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా