అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో
చాలా మంది హీరోల్లాగే అల్లు అర్జున్ కూడా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను వదులుకున్నాడు. డేట్స్ సమస్యలు, కథ నచ్చకపోవడం వంటి కారణాలతో బన్నీ రిజెక్ట్ చేసిన 'ఇష్క్', 'అర్జున్ రెడ్డి' వంటివి ఇతర హీరోలకు భారీ విజయాలను అందించాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కుమార్ దర్శకత్వంలో దీపికా పదుకొణెతో కలిసి పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు, ఇది భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
చాలా మంది హీరోల్లాగే అల్లు అర్జున్ కూడా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడమో, స్టోరీ సూట్ కాకపోవడమో, కథ నచ్చకపోవడమో.. ఇలా వివిధ కారణాలతో బన్నీ వదిలేసిన సినిమాలు చాలా నే ఉన్నాయి. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వగా కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడి అల్లు అర్జున్ జడ్జ్ మెంట్ కరెక్ట్ అని నిరూపించాయి. అలా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో ఒక క్రేజీ హీరో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. విక్రమ్ కే కుమార్ కు ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుంది. 13 బి, 24, మనం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు విక్రమ్ కే కుమార్. అలాగే యూత్ స్టార్ నితిన్ కు ‘ఇష్క్’ రూపంలో బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకు హీరోగా నితిన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. విక్రమ్ కే కుమార్ అల్లు అర్జున్ తో ఈ సినిమా చేద్దామనకున్నాడట. బన్నీకి కథ కూడా చెప్పాడట. అయితే అప్పటికే అల్లు అర్జున్ చేతిలో పలు సినిమాలు ఉండడంతో ఇష్క్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో ఆ మూవీ ని నితిన్ తో చేసి సూపర్ సక్సెస్ కొట్టారు విక్రమ్ కే కేమార్.. ఈ సినిమాతోనే 13 ఫ్లాప్ సినిమాలకు చెక్ పెడుతూ సూపర్ సక్సెస్ అందుకున్నాడు హీరో నితిన్. కేవలం ఇష్క్ ఒక్కటే కాదు వివిధ కారణాలతో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. జయం, భద్ర, బొమ్మరిల్లు, 100 % లవ్, అర్జున్ రెడ్డి, పండగ చేస్కో, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా మొదట అల్లు అర్జున్ దగ్గరకే వచ్చాయట. అయితే వివిధ కారణాలతో బన్నీ వాటిని వద్దనుకున్నాడట. ప్రస్తుతం అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ పాన్ వరల్డ్ మూవీలో బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. సుమారు 800 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో హాలీవుడ్ లెవెల్ లో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??
మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

