రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??
రైలు ప్రయాణంలో సమస్యలు ఎదురైనప్పుడు సర్దుకుపోవడం అవసరం లేదు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏసీ, పరిశుభ్రత, నీటి సరఫరా లేదా బెడ్ రోల్స్ సమస్యలైనా, రైల్వే కంట్రోల్ రూమ్ నంబర్‌కు (97013 73410) కాల్ చేసి పరిష్కారం పొందవచ్చు. ఆన్‌బోర్డ్ హౌస్‌కీపింగ్ కోసం 98498 31767కి కాల్ చేయండి. మీ సమస్య త్వరగా పరిష్కరించబడుతుంది.
రైలు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తాయా? సమస్యలతో సతమతం అయ్యారా? ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియడం లేదా? అయితే మీకోసమే ఈ న్యూస్.. సాధారణంగా రైలు ప్రయాణం చేసే సమయంలో సమస్యలు గుర్తించినా సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటాం. కానీ చిన్న కాల్‌తో ఆ సమస్యను పరిష్కరించవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అంటున్నారు. విద్యుత్ సమస్య మాత్రమే కాదు… ప్రయాణికులు ఎదుర్కొనే ఏ సమస్యనైనా సరే పరిష్కరించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని బోగీల్లో పలుచోట్ల ఫిర్యాదులు తెలియజేసేందుకు ఫన్ నెంబర్లను ప్రదర్శించింది. వాటికి ఫోన్ చేస్తే.. సదరు కాల్ రైల్వే కంట్రోల్‌రూమ్‌కు వెళుతుంది. మీరు ప్రయాణిస్తున్న రైలు, బోగీ, సీటు నెంబర్లు చెప్పాలి. సమస్యను తెలియజేయాలి. ఏసీ, విద్యుత్తు ప్లగ్ సాకెట్‌లు పని చేయకపోయినా, వాష్‌రూమ్‌ల పరిశుభ్రత, నీటి సరఫరా లేకపోయినా, బెడ్ రోల్స్, కోచ్ నిర్వహణ సరిగ్గా లేకపోయినా, బొద్దింకలు, ఎలుకల సంచారం వంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినా.. రైల్వే కంట్రోల్‌రూం… 97013 73410 కు కాల్ చేస్తే వీలైనంత తక్కువ సమయంలో సమస్యను పరిష్కరిస్తామని అంటున్నారు. ఇక ఆన్‌బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కోసం 98498 31767 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా
బుర్జ్ ఖలీఫా ఓనర్ బాక్‌గ్రౌండ్ చూస్తే మతిపోతుంది
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

