AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు కోచ్‌లపై రకరకాల గీతలు.. ఎందుకో తెలుసా ??

రైలు కోచ్‌లపై రకరకాల గీతలు.. ఎందుకో తెలుసా ??

Phani CH
|

Updated on: Jan 05, 2026 | 4:54 PM

Share

భారతీయ రైల్వే కోచ్‌ల రంగులు, స్ట్రైప్స్ వాటి చరిత్ర, ప్రాముఖ్యతను వివరిస్తాయి. నిరక్షరాస్యత ఉన్న కాలంలో ప్రయాణికులకు కోచ్‌లను గుర్తించడానికి ఇవి సహాయపడ్డాయి. ఇప్పుడు IRCTC యాప్‌తో టికెట్ బుకింగ్ సులువు అయినా, ఈ కలర్ కోడ్‌లు ముఖ్యమైనవి. 2025లో 10,000 కొత్త కోచ్‌లకు, వందే భారత్ రైళ్లకు కొత్త డిజైన్లు రానున్నాయి. ఈ మార్పులు భారత రైల్వే ఆధునీకరణను సూచిస్తాయి.

భారతీయ రైల్వే ప్రపంచంలోనే రెండో అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌. రోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. మనం ఎక్కే రైలు కోచ్‌లపై బ్లూ, రెడ్, గ్రీన్, బ్రౌన్ వంటి రకరకాల రంగులు చాలా మందిని ఆకర్షిస్తాయి. ఇలా వేర్వేరు రంగులు ఎందుకు ఉంటాయి అనేది కొంతమందికి వచ్చే డౌట్. దీంతో బోగీల రంగులపై చర్చ మొదలైంది. 2025లో రైల్వే 10,000 కొత్త నాన్-ఏసీ కోచ్‌లను తయారుచేస్తోంది. వీటికి కొత్త కలర్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. కోచ్‌లపై ఉండే స్ట్రైప్స్ కూడా ఒక్కో అర్థాన్ని తెలియచేస్తాయి. డయాగనల్ ఎల్లో/వైట్ స్ట్రైప్స్.. అన్‌రిజర్వ్డ్ కోచ్‌లను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇవి లేకపోతే.. ఆ కోచ్‌.. స్లీపర్ కోచ్ అని తెలుసుకోవచ్చు. రెడ్ స్ట్రైప్స్ EMU/MEMUలో ఫస్ట్ క్లాస్‌ను సూచిస్తాయి. గ్రీన్ స్ట్రైప్స్ మహిళలకు ప్రత్యేకం. గంటకు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే రైళ్లకు ఎల్లో స్ట్రైప్స్ ఉంటాయి. ఇటీవల ముంబై వెస్ట్రన్ రైల్వేలో ఆటో డోర్ క్లోజింగ్ EMUలకు కొత్త కలర్ ప్యాటర్న్‌లను ప్రవేశపెట్టారు. ఈ రంగులు, స్ట్రైప్స్‌ను భారతదేశంలో అక్షరాస్యత తక్కువగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టారు. తద్వారా ప్రయాణికులు తాము ఎక్కాల్సిన కోచ్‌ని ఈజీగా గుర్తుపట్టేవారు. ఇప్పుడు IRCTC యాప్‌లో టికెట్ బుకింగ్ సులభమైపోయింది. కాబట్టి ఈ కలర్స్ గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ ఈ కలర్ కోడ్‌లు ప్రయాణాన్ని యాక్సెసిబుల్ చేస్తాయి. వీటి వెనక ఇంత పెద్ద చరిత్ర ఉందని మనలో చాలా మందికి తెలియదు. అందుకే భారతీయ రైల్వే అనేది.. భారత్‌కి గర్వకారణం. మన రైళ్లలో, రైల్వేస్టేషన్లలో ఎన్ని సమస్యలు ఉన్నా.. మనం రైల్లో ప్రయాణిస్తే, ఒక గొప్ప పని చేసినట్లే. వందే భారత్‌కి ముందు వరకూ మన రైళ్ల డిజైన్, బోగీల ఆకారం అన్నీ ఒక రకంగా ఉండేవి. వందే భారత్ రైళ్లు పూర్తిగా మోడ్రన్ లుక్‌తో వచ్చాయి. ఇవి బుల్లెట్ రైళ్లు, మెట్రో రైళ్లను పోలి ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లలో మరిన్ని మార్పులు చెయ్యబోతోంది. క్రమంగా రైళ్ల వేగాన్ని పెంచేలా ప్లాన్స్ ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో సిటీ లిమిట్స్‌లో తిరిగే రైళ్ల సంఖ్య విపరీతంగా పెరగనుంది. అప్పుడు మనం మరెన్నో రకాల రంగుల కోచ్‌లు, రైళ్లను చూస్తాం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలికాలంలో ఈ కూరగాయలు తింటున్నారా.. డేంజర్‌

డైట్‌ చేస్తున్నారా ?? రెస్టారెంట్‌ కెళితే ఏం తినాలి ??

Dear Comrade: బాలీవుడ్ కు వెళ్తున్న డియర్‌ కామ్రేడ్‌

Kriti Sanon: సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేసిన కృతి సనన్

Kamal Haasan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కమల్ హాసన్