డైట్ చేస్తున్నారా ?? రెస్టారెంట్ కెళితే ఏం తినాలి ??
డైట్‌లో ఉండి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు క్యాలరీల గురించి మర్చిపోతున్నారా? బరువు తగ్గడానికి, ఫిట్‌నెస్‌కు ఆటంకం కాకుండా రెస్టారెంట్ భోజనాన్ని ఎలా ఆస్వాదించాలో ఈ వ్యాసం వివరిస్తుంది. ముందుగానే మెనూ చూసుకోవడం, సరైన ఆహారాన్ని ఎంచుకోవడం, నెమ్మదిగా తినడం వంటి సులభమైన చిట్కాలతో మీరు మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవచ్చు. రెస్టారెంట్‌లో కూడా ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించడానికి ఈ పద్ధతులను పాటించండి.
బరువు తగ్గడానికి, ఫిట్‌నస్ కోసం చాలా మంది డైట్ చేస్తుంటారు. ఏం తిన్నా క్యాలరీలు లెక్కలేసుకుని తింటుంటారు. అలాంటి వాళ్లే రెస్టరంట్‌కు వెళ్లి అన్నీ మర్చిపోయి ఫుల్‌గా లాగించేస్తారు. అలా జరగకూడదంటే ఈసారి రెస్టరంట్లకు వెళ్లినప్పుడు ఈ టిప్స్ పాటించి చూడండి. మీరు ఏ రెస్టరంట్‌లో తినాలనుకుంటున్నారో ఆన్‌లైన్‌లో ఆ రెస్టరంట్ మెనూ చూడండి. ముందే చూసుకుని వెళితే అదే ఆర్డర్ చేసుకొని తినొచ్చు. ఫుడ్ బాగుందని రోజూ తినేదానికన్నా ఇంకాస్త ఎక్కువ తినేస్తుంటారు. రోజూ ఎంత తింటారో అంతే మొత్తంలో తినాలి. ఇది కాస్త కష్టమే అయినా.. డైట్‌లో ఉన్నారు కనుక కచ్చితంగా అలవాటు చేసుకోండి. రెస్టరంట్‌లో తింటాం కదా అని కడుపును ఖాళీగా ఉంచకండి. అలా చేస్తే మీరు ఆకలితో కంటికి కనిపించిన ఫుడ్‌ని ఆర్డర్ పెట్టేస్తారు. అది మంచిది కాదు కాబట్టి.. రెస్టరంట్‌కు వెళ్లే ముందు ఏదైనా ఒక పండు తినండి. గ్రిల్, స్టీమ్, బాయిల్డ్ పద్ధతిలో ఫుడ్‌ను ఎంచుకోండి. తప్పదంటే వంటకంలో నూనె, పన్నీర్ తగ్గించమని సిబ్బందికి చెప్పొచ్చు. బిర్యానీ తిన్న తర్వాత చాలా మంది సాఫ్ట్‌డ్రింక్ తాగుతుంటారు. వాటిలో క్యాలరీలు ఎక్కువ. వాటికి బదులుగా నిమ్మరసం లేదా నీళ్లు తాగడం మంచిది. డెజర్ట్స్ వైపు చూడకండి. నచ్చిన ఆహారం ఎలాగైనా తినాలి అనుకుంటే.. కాస్త నెమ్మదిగా తినండి. 15-20 నిమిషాల తర్వాత మీరు కొంచమే తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ తినాలనిపించదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dear Comrade: బాలీవుడ్ కు వెళ్తున్న డియర్ కామ్రేడ్
Kriti Sanon: సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేసిన కృతి సనన్
Kamal Haasan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కమల్ హాసన్
Naga Chaitanya: 2026 గుర్తు పెట్టుకోండి.. నాదే అంటున్న నాగ చైతన్య
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

