Ram Charan: ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న రామ్ చరణ్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది: హీరోయిన్ల ఎంపిక. గత ఆరేళ్లుగా, ఎన్టీఆర్ చిత్రాలలో నటించిన భామలు ఆ తర్వాత చరణ్ సినిమాలలో అవకాశం పొందుతున్నారు. పూజా హెగ్డే, జాన్వీ కపూర్ ఈ జాబితాలో ఉండగా, ఇప్పుడు రుక్మిణి వసంత్ వంతు. ఇది యాదృచ్ఛికమా లేక కొత్త ట్రెండా చూడాలి.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఓ పోలిక ఉంది ఎంతమంది గమనించారు..? ఏం పోలిక.. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారు.. కమర్షియల్ యుగంలోనూ మల్టీస్టారర్ చేసారు అంతేగా అనుకుంటున్నారా..? కానీ ఈ మధ్య ఒక్క విషయంలో ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నారు చరణ్. ఆరేళ్లుగా ఇదే తంతు. మరి ఆ ఫాలోయింగ్ ఏంటో చూద్దామా..? ఈ పాట ఇక్కడ ఎన్టీఆర్ పాడారు కానీ నిజానికి రామ్ చరణ్‌కు ఇది బాగా సెట్ అవుతుంది. హీరోయిన్ల విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నారు మెగా వారసుడు. యాదృశ్చికమో ఏమో కానీ తారక్‌తో నటించగానే.. నెక్ట్స్ చరణ్ సినిమాలో ఆ భామకు ఛాన్స్ వస్తుంది. అరవింద సమేత, ఆచార్య నుంచే ఇది జరుగుతుంది. 2018లో రంగస్థలంలో పూజా స్పెషల్ సాంగ్ చేసారు.. అదే ఏడాది తారక్‌తో అరవింద సమేతలో జోడీ కట్టారు. కట్ చేస్తే.. ఆచార్యలో చరణ్‌తో జోడీ కట్టారు పూజా. అలాగే దేవరలో జాన్వీ కపూర్‌తో రొమాన్స్ చేసారు తారక్. తంగం పాత్రలో అమ్మడు బాగానే ఒదిగిపోయారు. దేవరకు జాన్వీ గ్లామర్ కూడా బాగా హెల్ప్ అయింది. దేవర తర్వాత రామ్ చరణ్‌తో పెద్దిలో నటిస్తున్నారు జాన్వీ కపూర్. చికిరీ పాటలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇప్పుడిక రుక్మిణి వసంత్ వంతు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాతో తెలుగుకి డెబ్యూ చేస్తున్నారు ఈ బ్యూటీ. సుకుమార్, చరణ్ సినిమాలోనూ రుక్మిణి వసంత్ పేరే పరిశీలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్
Sandeep Vanga: స్పిరిట్ అప్‌డేట్.. వంగా దెబ్బకు ఫ్యూజులు ఔట్
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

