Sandeep Vanga: స్పిరిట్ అప్‌డేట్.. వంగా దెబ్బకు ఫ్యూజులు ఔట్
అనిమల్ తర్వాత సందీప్ వంగా 'స్పిరిట్' కోసం ప్రభాస్‌తో అద్భుత ప్రణాళికలు రచించారు. 80% రీ రికార్డింగ్ పూర్తి చేసి, 90 రోజుల్లో షూటింగ్ ముగించి, 6 నెలల్లో సినిమా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభాస్ లుక్, త్రిప్తి దిమ్రి పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించాయి. 2026 చివరిలో లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుంది, ఇది ప్రభాస్ కెరీర్‌లో 8వ అద్భుతం కానుంది.
యానిమల్ విడుదలై చూస్తుండగానే రెండున్నరేళ్ళవుతుంది. ఇన్ని రోజులుగా సందీప్ వంగా ఖాళీగా ఉన్నాడా అనే అనుమానం రావచ్చు.. కానీ అదేం కాదు.. ఈ గ్యాప్‌లో చాలా చేసారు వంగా. స్పిరిట్ కోసం ఈయన ఫాలో అవుతున్న రూట్ చూస్తుంటే మిగిలిన దర్శకులకు మతి పోతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరగితే ప్రభాస్ సినిమాల్లో అదో 8th వండరే. మరి ఏంటా ప్లానింగ్..?ప్రభాస్ ఇప్పుడున్న బిజీకి దర్శకులకు టోకన్ నెంబర్ పెట్టాలేమో..? ఒకేసారి మూడు నాలుగు సినిమాలకు కమిట్ అవుతున్నారీయన. కానీ ఎవరి నెంబర్ ఎప్పుడొస్తుందనేది కన్ఫ్యూజన్. ఈ క్రమంలోనే ఒక్కో సినిమా పూర్తి చేస్తూ వస్తున్నారు రెబల్ స్టార్. ప్రస్తుతం ఫౌజీని కాస్త పక్కనబెట్టి.. స్పిరిట్ వైపు వచ్చేసారు ప్రభాస్. ఒక్క లుక్‌తోనే దేశమంతా ఊపేసారు వంగా. స్పిరిట్ కోసం కొన్ని రోజులు ఫౌజీకి బ్రేక్ ఇచ్చారు రెబల్ స్టార్. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసారు వంగా. ప్రభాస్‌తో సినిమా అంటే కనీసం ఏడాది కావాల్సిందే.. కానీ సందీప్ మాత్రం రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయాలని చూస్తున్నారు. స్పిరిట్ రీ రికార్డింగ్ 80 శాతం పూర్తైంది. పైగా షూటింగ్ కూడా నాన్ స్టాప్‌గా జరుగుతూనే ఉంది. ఆ మధ్య ప్రభాస్ పుట్టిన రోజున స్పిరిట్ ఆడియోను విడుదల చేసిన సందీప్.. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయింది. షర్ట్ లెస్‌గా ప్రభాస్ లుక్.. ఒంటిపై దెబ్బలు.. పక్కనే త్రిప్తి దిమ్రి సిగరెట్ అంటిస్తున్న ఇంటెన్స్ లుక్.. ఆ పక్కనే త్రిప్తి కోసం మందు గ్లాస్.. ఇవన్నీ పీక్స్‌లో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ 90 రోజుల్లోనే పూర్తి చేసి.. ఆర్నెళ్లలో సినిమా రెడీ చేయాలని చూస్తున్నారు సందీప్. షూట్ సమయంలో మిగిలిన 20 శాతం BGM సిద్ధం చేస్తానని.. రీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ త్వరగానే అవుతుందంటున్నారు సందీప్. ఈ లెక్కన 2026 చివర్లో గానీ.. 2027 సంక్రాంతి సమయంలో గానీ స్పిరిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

