ఒకేసారి మూడు సినిమాలు ప్రకటించిన యంగ్ హీరో
బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు శ్రీను'తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, 'కిష్కింధపురి'తో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. 'హైందవ', 'టైసన్ నాయుడు', 'రామం' వంటి కొత్త చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. 2026 నాటికి మూడు సినిమాలు విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్న బెల్లంకొండ, ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
చాలా మంది స్టార్ హీరోల వారసులు కూడా కుళ్లుకునేలా ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోయారు. చాలా ఏళ్ళ తర్వాత గతేడాది ఫామ్‌లోకి వచ్చిన బెల్లంకొండ.. వరస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తారా..? బెల్లంకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ స్టోరీ.. అల్లుడు శ్రీనుతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచినా డెబ్యూ హీరోకు పర్ఫెక్ట్ ఎంట్రీగా నిలిచింది. జయ జానకీ నాయకాతో మాస్‌కు బాగా చేరువయ్యారు బెల్లంకొండ. మాస్ సినిమాలు చేస్తూనే సీత, రాక్షసుడు లాంటి డిఫెరెంట్ సినిమాలు ట్రై చేసారు. గతేడాది కిష్కింధపురితో హిట్ కొట్టారు బెల్లంకొండ. కిష్కింధపురి తర్వాత జోరు పెంచేసారు బెల్లంకొండ శ్రీనివాస్. హార్రర్ థ్రిల్లర్‌తో మంచి విక్టరీ అందుకున్న ఈ హీరో.. వరస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిపోయారు. జనవరి 3న బెల్లంకొండ పుట్టిన రోజు సందర్భంగా హైందవతో పాటు టైసన్ నాయుడు అప్‌డేట్స్ వచ్చాయి. ఇందులో టైసన్ నాయుడు సినిమాను భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. హైందవలో మోస్ట్ ట్రెండింగ్ దేవుడి టాపిక్‌తో వస్తున్నారు బెల్లంకొండ. లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. అలాగే రామం.. ది రైజ్ ఆఫ్ అకీరా అనే మరో సినిమాను ప్రకటించారు ఈ హీరో. దీనికి లోకమాన్య ఈ సినిమాకు దర్శకుడు. మొత్తానికి ఈ జోరు చూస్తుంటే.. 2026లో కనీసం మూడు సినిమాలతో వచ్చేలా ఉన్నారు బెల్లంకొండ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

