Naga Chaitanya: 2026 గుర్తు పెట్టుకోండి.. నాదే అంటున్న నాగ చైతన్య
2026 నాగ చైతన్యకు కీలక సంవత్సరం కానుంది. 2025లో తండేల్ విజయంతో ఊపుమీదున్న చైతూ, వృషకర్మ వంటి మిస్టికల్ థ్రిల్లర్‌తో పాటు బ్లాక్‌బస్టర్ దూత సీక్వెల్ దూత 2లో నటించనున్నారు. అలాగే, తన కెరీర్‌లో 25వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. విభిన్న పాత్రలు, కమర్షియల్ విజయాలతో ఈ ఏడాది ఆయనకు మరపురానిదిగా నిలవనుంది.
నాగ చైతన్యకు 2026 ప్రత్యేకంగా నిలిచిపోనుందా..? ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ లేనన్ని స్పెషల్ థింగ్స్ చైతూ కోసం ఈ ఏడాది వెయిట్ చేస్తున్నాయా..? న్యూ ఇయర్‌లో అక్కినేని వారసుడికి అంతగా కలిసొస్తున్న అంశాలేంటి.. ఎందుకంతగా 2026 నాగ చైతన్యకు ప్రత్యేకంగా మారబోతుంది..? అసలు ఈ ఏడాది ఆయనేం చేయబోతున్నారో చూద్దామా..? 2025లో వచ్చిన తండేల్‌తో విమర్శకుల ప్రశంసలతో పాటు 100 కోట్ల విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య. 2026లోనూ కూడా అదే జోష్‌ను కొనసాగించాలని చూస్తున్నారీయన. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా.. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్ని ఎంచుకుంటున్నారు చైతూ. అలా చేస్తున్నదే వృషకర్మ. ఇది మిస్టికల్ థ్రిల్లర్ జానర్‌లో వస్తుంది. వృషకర్మలో అడ్వెంచరస్ రోల్ చేస్తున్నారు చైతూ. ఇందులో రా అండ్ రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు.. పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ అర్థమవుతోంది. ఇక OTTలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దూత వెబ్ సిరీస్‌కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు చైతూ. మరోసారి గ్రిప్పింగ్ స్టోరీతో విక్రమ్ కే కుమార్‌తో దూత 2తో రానున్నారు అక్కినేని హీరో. 2026లోనే తన 25వ సినిమా వైపు అడుగేయబోతున్నారు చైతూ. వృషకర్మ తర్వాత రాబోయే చైతన్య 25 టైటిల్ ఏంటి..? జానర్ ఏంటి..? దర్శకుడు ఎవరు..? అనే విషయాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో శివ నిర్వాణ ముందున్నారని తెలుస్తుంది. గతంలో ఈ కాంబోలో వచ్చిన మజిలీ సూపర్ హిట్టైంది. మొత్తానికి 2026 చైతూకు అన్నివిధాల మెమొరబుల్‌గా మారబోతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న రామ్ చరణ్
స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్
Sandeep Vanga: స్పిరిట్ అప్‌డేట్.. వంగా దెబ్బకు ఫ్యూజులు ఔట్
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

