Kamal Haasan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కమల్ హాసన్
రజినీకాంత్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కమల్ హాసన్ తన నిర్మాణంలో తలైవా 173 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 50 ఏళ్ల స్నేహబంధానికి గుర్తుగా లోకనాయకుడు ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా, రజినీకాంత్ జైలర్ 2 తర్వాత ఉంటుంది. కమల్, రజినీ అభిమానుల్లో ఈ వార్త ఉత్సాహం నింపుతోంది.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కంటిమీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు కమల్ హాసన్. ఒకటి రెండేళ్ల స్నేహం కాదు.. దాదాపు 50 ఏళ్ళ ఫ్రెండ్ షిప్ కావడంతో.. రజినీ దగ్గర మాట రాకూడదని చేసిన ప్రామిస్‌ను బాగా పర్సనల్‌గా తీసుకున్నారు లోకనాయకుడు. అన్నట్లుగానే స్నేహితుడి కోసం అదిరిపోయే ప్రాజెక్ట్ సెట్ చేసారు. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? సౌత్ ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్ హాసన్.. ఇద్దరూ ఇద్దరే. లెజెండ్స్ అనే మాటకు వాళ్లే నిదర్శనం. రజినీ కమర్షియల్ మార్కెట్‌లో తోపు అయితే.. కమల్ తనదైన శైలిలో ప్రయోగాలు చేస్తూనే రికార్డులు తిరగరాస్తుంటారు. కెరీర్ మొదట్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు కమల్ నిర్మాణంలో రజినీకాంత్ నటించడానికి రెడీ అయ్యారు. నిజానికి ఇద్దరం కలిసి నటిస్తామని చెప్పారు కమల్ హాసన్. రజినీ కూడా ఇదే విషయం కన్ఫర్మ్ చేసారు. కానీ దానికంటే ముందే తన నిర్మాణంలో రజినీతో ఓ సినిమా చేస్తానని మాటిచ్చారు లోకనాయకుడు. అన్నట్లుగానే ఈ ప్రాజెక్ట్ కోసం తంటాలు పడుతున్నారు. ఆ మధ్య సుందర్ సి సినిమా ఆల్మోస్ట్ లాక్ అయి.. ఆ తర్వాత ఆగిపోయింది. తాజాగా తలైవా 173పై అధికారిక ప్రకటన వచ్చింది. సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు కమల్. శివకార్తికేయన్ డాన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు సిబి. మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టారు. నానితో సినిమా ప్లాన్ చేసినా కుదర్లేదు.. ఇప్పుడేకంగా రజినీ ప్రాజెక్ట్ ఓకే అయింది. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ 2లో నటిస్తున్నారు. కొన్నాళ్లుగా నెక్ట్స్ సినిమాపై సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్న సూపర్ స్టార్.. మరోసారి కుర్ర దర్శకుడికే ఓకే చెప్పారు. కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న సిబి చెప్పిన కథ ఓకే చేసారు తలైవా. ప్రతీ హీరోకు ఫ్యామిలీ ఉంటుంది.. ప్రతీ ఫ్యామిలీలో ఓ హీరో ఉంటాడనే లైన్‌తో ఈ సినిమా వస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naga Chaitanya: 2026 గుర్తు పెట్టుకోండి.. నాదే అంటున్న నాగ చైతన్య
Ram Charan: ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్న రామ్ చరణ్
స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తున్న 30 ప్లస్ బ్యూటీస్
Sandeep Vanga: స్పిరిట్ అప్‌డేట్.. వంగా దెబ్బకు ఫ్యూజులు ఔట్
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

