చలికాలంలో ఈ కూరగాయలు తింటున్నారా.. డేంజర్
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహార ఎంపికలు అవసరం. ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్ వంటివి శరీరానికి వేడిని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే, దోసకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న కూరగాయలు, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచినవి చలికాలంలో జలుబు, కఫం వంటి సమస్యలను పెంచవచ్చు. కాబట్టి, ఈ సీజన్‌లో జాగ్రత్తగా ఎంచుకోవాలి.
పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు వీటినుంచి సహజంగా లభిస్తాయి. ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో కొన్నిరకాల కూరగాయలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కనుక చలికాలంలో వాటిని తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. నిపుణుల ప్రకారం… చలికాలంలో అనారోగ్య సమస్యలు త్వరగా దరిచేరుతాయి. అందుకే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. చలికాలంలో ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూర, మెంతికూర, బచ్చలికూర, చుక్కకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ A, C, K, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని లోపల నుంచి వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి వంటి రూట్ వెజిటెబుల్స్ చలికాలానికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఇవి భూమిలో పెరుగుతాయి కాబట్టి సహజంగానే వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కూరగాయలు శరీరానికి లోపల నుంచి వేడిని అందిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్‌లో ఉండే బీటా-కెరోటిన్, ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని సలాడ్లు, సూప్‌లు లేదా కూరల రూపంలో తీసుకోవడం ఉత్తమం. కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ వెజిటెబుల్స్ కూడా చలికాలంలో శరీరానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి వేడిని ఇవ్వడంతో పాటు, దేహంలోని టాక్సిన్లను బయటకు పంపుతాయి. విటమిన్ సి చలికాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలను నియంత్రిస్తుంది. దొండకాయ, బెండకాయ వంటివి కూడా తేలికగా జీర్ణమవుతాయి కాబట్టి ఈ సీజన్‌లో తీసుకోవచ్చు. చలికాలంలో దోసకాయ, బీరకాయ, కాకరకాయ వంటి కూరగాయల్లో అధికంగా నీరు ఉంటుంది. వీటిని ఉదయం లేదా రాత్రి తీసుకుంటే కఫం, జలుబు సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి శరీరంలో చలిని పెంచుతాయి. కనుక వీటిని తీసుకోకపోవడమే మంచిది. అలాగే, టమాటను కూడా చలికాలంలో మితంగా తీసుకోవాలి. ఇది కొందరికి కడుపు సంబంధిత సమస్యలను తీసుకురావచ్చు. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చలికాలంలో టమాట తినడం తగ్గించాలి. చింతపండు, గుమ్మడికాయ కూడా కొన్ని సందర్భాల్లో శరీరంలో చలిని మరింత పెంచవచ్చు కాబట్టి వీటిని కూడా మితంగా తినడం మంచిది. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన కూరగాయలు చలికాలంలో శరీరానికి హానిచేస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డైట్ చేస్తున్నారా ?? రెస్టారెంట్ కెళితే ఏం తినాలి ??
Dear Comrade: బాలీవుడ్ కు వెళ్తున్న డియర్ కామ్రేడ్
Kriti Sanon: సక్సెస్ సీక్రెట్ ను రివీల్ చేసిన కృతి సనన్
Kamal Haasan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కమల్ హాసన్
Naga Chaitanya: 2026 గుర్తు పెట్టుకోండి.. నాదే అంటున్న నాగ చైతన్య
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

