టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా.. నిజమెంత ??
టమాటాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయనేది కేవలం అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టమాటాల్లో ఆక్సలేట్ చాలా తక్కువగా ఉంటుంది, అది రాళ్లకు కారణం కాదు. డీహైడ్రేషన్, అంతర్లీన ఆరోగ్య సమస్యలు మూత్రపిండాల రాళ్లకు ప్రధాన కారణాలు. కిడ్నీ ఆరోగ్యం కోసం అపోహలను నమ్మకుండా, సరైన సమాచారం తెలుసుకోవడం అత్యవసరం.
టమాటా.. ప్రతి వంటలో ఇమిడిపోయే కూరగాయ. అందుకే దీనిని ప్రతి ఒక్కరూ వినియోగిస్తారు. అయితే ఈ టమాటాలు ఎక్కువగా తినడం అంత మంచిదికాదని కొందరు నమ్ముతారు. టమాటాలు అధికంగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని భావిస్తారు. వాటిని తినడానికి ఇష్టపడరు. అయితే ఇదంతా అపోహ మాత్రమే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రపంచంలో అత్యధికంగా తినే కూరగాయలలో టమోటా ఒకటి కాబట్టి ఇదే నిజమైతే కిడ్నీలో రాళ్లతో బాధపడే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండాలి కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. టమాటాలు కిడ్నీలో రాళ్లకు ముడిపడటానికి కారణం వాటిలో ఆక్సలేట్ ఉండటమే. కిడ్నీలో ఏర్పడే రాళ్లలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు సర్వసాధారణం. అయితే టమాటాల్లో ఆక్సలేట్ చాలా తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల టమాటాల్లో కేవలం 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఇంత తక్కువ మొత్తం సరిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు రావడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. మీరు ఎక్కువగా కూర్చునే ఉద్యోగం చేసినా లేదా కఠినమైన శారీరక పనిలో పాల్గొన్నా రోజుకు కనీసం 2.5 లీటర్ల నుండి 3 లీటర్ల నీరు త్రాగడం తప్పనిసరి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం అంతర్లీన ఆరోగ్య పరిస్థితి, కొన్ని ఎంజైమ్‌ల లోపం లేదా జీవక్రియ సమస్యలు కావచ్చంటున్నారు. ఆక్సలోసిస్ అనే అరుదైన జీవక్రియ రుగ్మత కారణంగా మూత్రపిండాలు శరీరం నుండి కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలను మూత్రం ద్వారా విసర్జించడం ఆపివేస్తాయి. ఇది కిడ్నీలు పనిచేయడం మానేయడానికి దారితీయవచ్చు. కిడ్నీలో అన్ని రాళ్లు ఒకే రకంగా ఉండవు. కాల్షియం ఆక్సలేట్‌తో పాటు యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు వంటి ఇతర రకాల స్ఫటికాల వల్ల కూడా రాళ్లు ఏర్పడతాయి. కొన్ని మాంసాహార ఆహారాలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందనే నమ్మకం కూడా తప్పు. యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడితే, వైద్యులు మందులు సూచిస్తారు. యూరిక్ యాసిడ్ రకం రాళ్లు ఉన్నవారు, చేపలు, జంతువుల మాంసంలో లభించే ప్రోటీన్లతో సహా ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. అయితే ఈ విషయంలో ఆహారం కంటే వైద్యుల సలహా, మందులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు కిడ్నీ సమస్యలు లేదా డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, ప్రోటీన్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం మంచిది. ఎల్లప్పుడూ వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలు కోచ్‌లపై రకరకాల గీతలు.. ఎందుకో తెలుసా ??
చలికాలంలో ఈ కూరగాయలు తింటున్నారా.. డేంజర్
డైట్ చేస్తున్నారా ?? రెస్టారెంట్ కెళితే ఏం తినాలి ??
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

