నిద్రలో గొంతును నులిమింది ఎవరు.. అది దెయ్యం పనేనా
గాఢ నిద్రలో ఎవరో గుండెలపై కూర్చున్నట్లు, కదలలేనట్లు అనిపించేది స్లీప్ పెరాలసిస్. ఇది దెయ్యాలు, చేతబడుల వల్ల కాదని, శాస్త్రీయ కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్ర లేకపోవడం, ఒత్తిడి ప్రధాన కారణాలు. 8 గంటల నిద్ర, సరైన జీవనశైలితో ఈ పరిస్థితిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీని లక్షణాలు, కారణాలు, నివారణ మార్గాలను వివరంగా తెలుసుకోండి.
అర్ధరాత్రి..! గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది..! క్రమంగా గుండెలపైకెక్కి కూర్చున్నట్లు.. గొంతు నులుముతున్నట్లు ఉంటుంది..! ఊపిరాడక మనం ఒక్క తోపు తోయాలనుకుంటాం.కానీ, చేతులు కాళ్లు కదలవు..! ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు..! కొందరికి ఈ స్థితి ఒకరెండ్రుసార్లు ఎదురైతే.. మరికొందరికి ఇదో నిత్యకృత్యం..! కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు. ఇదంతా దెయ్యం పనో.. చేతబడుల ఫలితమో కాదని, శాస్త్రీయ కారణాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రకు సంబంధించిన నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే.. స్లీప్ పెరాలసీస్ కారణంగా ఇలా జరుగుతుందని అంటున్నారు. అంటే ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతం అనవచ్చు. స్లీప్ పెరాలసిస్ కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్‌కు కారణాలవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. నిద్రిస్తున్నప్పుడు.. గుండె దడ పెరిగి ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. స్లీప్ పెరాలసిస్ కనీసం 30 సెకన్లు ఉంటుందట. నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయట పడతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని, మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావడానికి దెయ్యాలో, చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరైన సమయంలో నిద్ర పోక పోవడం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్‌కు గురవుతుంటారు. రోజులో ఎనిమిది గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్‌కు చెక్ పెట్టగలదని వైద్యులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో
రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??
మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

