కోహినూర్ వజ్రం అరిష్టమా ?? రాజులు ఎందుకు వణిపోయారు ??
కోహినూర్ వజ్రం, 13వ శతాబ్దంలో గోల్కొండ కొల్లూరు గనులలో బయటపడింది. దాని చరిత్రంతా యుద్ధాలు, కుట్రలతో నిండి ఉంది. అనేక భారతీయ రాజులు ధరించిన ఈ వజ్రం, పురుషులకు శాపంగా, మహిళలకు అదృష్టంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం బ్రిటీష్ రాజకుటుంబ ఆభరణాలలో భాగమైన దీనిని భారత్‌కు తిరిగి ఇవ్వాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన రత్నాలలో ఒకటి.
కోహినూర్ డైమండ్.. ఈ వజ్రానికే కాదు, ఆ పేరుకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఈ వజ్రాన్ని అఖండ భారతదేశాన్ని పాలించిన ఎంతోమంది రాజులు తమ కిరీటంలో పెట్టుకుని దర్పాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం బ్రిటిష్ రాచరిక ఆభరణాలలో భాగమైపోయింది.అయితే కొంతకాలంగా ఆ వజ్రాన్ని భారత్‌కు వాపస్ చేయాలంటూ లండన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. టవర్ ఆఫ్ లండన్‌లోని జువెల్ హౌస్‌లో బహిరంగ ప్రదర్శనకు ఉంచిన కోహినూర్ అందాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న కోహినూర్ వజ్రం అనేకమంది రాజులకు, పాదుషాలకు శాపంగా పరిణమించిందనే టాక్ ఉంది. 105.6 క్యారెట్ల బరువు ఉండే కోహినూర్ 13వ శతాబ్దంలో తెలంగాణలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్న కొల్లూరు గనులలో మొదట బయటపడింది. ఎందరో రాజులు, రాజ్యాలు మారిన ఈ అపురూపమైన వజ్రం భీకర యుద్ధాలకు దారితీసింది. దీన్ని పొందేందుకు హింస, విద్రోహం, చిత్రహింసలు, హత్యలు వంటివి శతాబ్దాల తరబడి సాగాయి. కోహినూర్ అంటే కాంతి పర్వతం అని అర్థం. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తన తలపాగాలో కోహినూర్ వజ్రాన్ని ధరించిన సంగతి తెలుసుకున్న.. పర్షియన్ రాజు నాదర్ షా దానిని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేస్తాడు. అప్పట్లో రాజులు కలుసుకుంటే.. ఒకరి తలపాగాలు మరొకరిని ఇచ్చుకునే సంప్రదాయం ఉండటంతో.. మహమ్మద్ షా తలపాగాను నాదిర్ షా అందుకున్నాడు. దానితో బాటే కోహినూర్ కూడా అతని వశమైంది. అయితే కోహినూర్ వజ్రం రాజులకు కలసి రాలేదని రోయినా గ్రేవాల్ అనే రచయిత.. తన పుస్తకం ‘ఇన్ ది షాడో ఆఫ్ ది తాజ్, ఎ పోర్ట్రెయిట్ ఆఫ్ ఆగ్రా’లో చెప్పుకొచ్చారు. కోహినూర్ దక్కించుకున్న నాదర్ షా హత్యకు గురికావటం, అతని కుమారులు ఆదిల్ షా, ఇబ్రహీం కూడా చనిపోవటం, అతని మనవడు షారుఖ్, కోహినూర్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అహ్మద్ షాకు అప్పగించవలసి రావటం, కోహినూర్‌ను దక్కించుకున్న అహ్మద్ షా కూడా అకాల మరణం పాలవటం, షా కుమారుల మధ్య విభేదాలతో ఆ వజ్రం రంజిత్ సింగ్ వశం కావటం వంటి అనేక పరిణామాలను రోయినా గ్రేవాల్ తన పుస్తకాలలో వివరించారు. తర్వాత.. రంజిత్ సింగ్ మరణానంతరం సింహాసనం కోసం పోటీ, అతని కుమారుడి ద్వారా ఆ వజ్రం.. బ్రిటిషర్ల వశం కావటం.. తర్వాత దానిని బ్రిటన్ రాజవంశంలోని పలువురు రాణులు ధరించటం వంటి ఘట్టాలను వివరించారు. అయితే, మొత్తం చరిత్రను పరిశీలిస్తే.. అది పురుషులకు అరిష్టంగా, మహిళలకు అదృష్టంగా మారిందని తెలుస్తోంది.1849లో సిక్కు సామ్రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్ విలీనం చేసుకుంది. చివరి లాహోర్ ఒప్పందంపై మహారాజా దులీప్ సింగ్, బ్రిటిష్ ప్రతినిధులు సంతకాలు చేయగా బ్రిటిష్ రాణి విక్టోరియాకు కోహినూర్ బహుమతిగా వెళ్లింది. 1857 తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీని దిగ్భ్రాంతికి గురిచేయగా కోహినూర్ తెచ్చే దురదృష్టాన్ని గుర్తించిన బ్రిటిషర్లు దీన్ని రాజులెవరూ ధరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోహినూర్ వజ్రం పొదిగిన కిరీటాన్ని క్వీన్ విక్టోరియా, క్వీన్ అలెగ్జాండ్ర, క్వీన్ మదర్ ఎలిజబెత్ యాంజెలా మార్గెరిట్, క్వీన్ ఎలిజబెత్ 2 తదితర మహారాణులు మాత్రమే ధరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిద్రలో గొంతును నులిమింది ఎవరు.. అది దెయ్యం పనేనా
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ హీరో
రైలు ప్రయాణంలో సమస్యలా ?? ఏ నెంబర్ కు కాల్ చేయాలో తెలుసా ??
మంచుకురిసే వేళలో డ్రైవింగ్ చేస్తున్నారా ?? ఈ జాగ్రత్తలు తప్పనిసరి సుమా
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

