అమెరికా గ్రీన్ కార్డ్ కావాలా ?? పెళ్లి చేసుకుంటే సరిపోదు.. కలిసి ఉండాల్సిందే
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం ఇప్పుడు మరింత కష్టమైంది. ట్రంప్ ప్రభుత్వం వివాహ ఆధారిత గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేసింది, దంపతులు ఒకే ఇంట్లో నివసించడం తప్పనిసరి చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం చేసుకునే పెళ్లిళ్లను అధికారులు లోతుగా విచారిస్తారు. డైవర్సిటీ వీసా లాటరీ రద్దు, వర్క్ పర్మిట్ కాలం కుదింపు వంటి నిర్ణయాలు గ్రీన్ కార్డ్ ప్రక్రియను క్లిష్టతరం చేశాయి.
అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతినిచ్చే ‘గ్రీన్ కార్డ్’ పొందడం ఇప్పుడు మరింత కష్టంగా మారింది. గతంలో అమెరికన్ పౌరులను వివాహం చేసుకోవడం ద్వారా సులభంగా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉండేది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినతరం చేసింది. కేవలం కాగితాల మీద పెళ్లి జరిగితే సరిపోదని, భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తేనే గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేసారు. కేవలం బంధంలో ఉన్నంత మాత్రాన గ్రీన్ కార్డ్ రాదు, కలిసి నివసిస్తేనే వస్తుందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాది స్టెయిన్ అన్నారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాలతో దంపతులు వేర్వేరు ఇళ్లలో నివసిస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఆ అప్లికేషన్లను తిరస్కరించే అవకాశం ఉందనీ తెలిపారు. కేవలం ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే పెళ్లి చేసుకున్నారా? అనే కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ల ప్రమేయం ఉండటంతో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ‘ఆందోళనకర దేశాలు’గా గుర్తించిన 19 దేశాలకు చెందిన శాశ్వత నివాసితుల గ్రీన్ కార్డ్‌లను సమీక్షించాలని అధ్యక్షుడు ఆదేశించారు. ఇప్పటికే గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల వర్క్ పర్మిట్ కాలాన్ని 18 నెలలకు కుదించారు. ఏటా 50 వేల మందికి వీసాలు ఇచ్చే ‘డైవర్సిటీ వీసా లాటరీ’ ప్రోగ్రామ్‌ను రద్దు చేసారు. దంపతులు ఒకే చిరునామాలో ఉన్నారా? లేదా? అనే అంశంపైనే కాకుండా, వారి మధ్య ఉన్న బంధం ఎంతవరకు నిజాయతీతో ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తారు. ఇంటి తలుపు తట్టి మరీ విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి విడిగా ఉండే దంపతులు దరఖాస్తు చేసే ముందే న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు.. 3AC టికెట్ రూ. 2 వేల 300
వాహనదారులకు కేంద్రం శుభవార్త.. సరికొత్త రూల్ ఫిబ్రవరి 1 నుండి అమలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

