Poonam Kaur: అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు.. ఆ నటుడి వల్లే నా పెళ్లి ఆగిపోయింది: పూనమ్ కౌర్
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తోంది నటి పూనమ్ కౌర్. టాలీవుడ్ కు చెందిన కొందరిపై తరచూ సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

‘మాయాజాలం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది పంజాబీ బ్యూటీ. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కూడా ఒక విచిత్రం, వినాయకుడు, నాగవల్లి, పయనం, గగనం, శ్రీనివాస కల్యాణం, నాతి చరామీ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, మరికొన్ని సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసిందీ అందాల తార. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చేసిందీ అందాల తార. అదే సమయంలో రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ నటి సినిమాలకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో తన కాంట్రవర్సీ పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన కొందరి ప్రముఖులపై తరచూ ఆరోపణలు చేస్తుంటుందీ అందాల తార. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పూనమ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ‘తమ రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు నన్ను వాడుకోవాలని చూశాయి. అందుకోసం నన్ను బెదిరించాయి. నాకు డబ్బులు, పదవులు కూడా ఆఫర్ చేశారు. చివరికి ఒక నటుడికి నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతే.. నా అశ్లీల వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు..
‘నా స్నేహితుడిని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. కానీ సడన్ గా అదే సమయంలో పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టారు. దాంతో నా పెళ్లి కూడా ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మా అమ్మకు గుండెపోటు కూడా వచ్చింది. పోసాని కృష్ణ మురళి వల్లే నా వ్యక్తిగత జీవితం కూడా నాశనమైంది. పొలిటికల్ లీడర్స్ కి దగ్గరగా ఉన్న అమ్మాయిలకు ఎప్పటికీ ఏం కాదు.. ఎవరైతే దూరంగా ఉంటారో వారి గురించే చెడుగా మాట్లాడుతారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పూనమ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
క్రికెటర్ మహ్మద్ సిరాజ్ తో పూనమ్ కౌర్..
View this post on Instagram
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పూనమ్ కౌర్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




