Tollywood : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రెండేళ్లనాటి సినిమా.. మళ్లీ మళ్లీ తెగ చూస్తున్న జనాలు..
దాదాపు రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమా. ఇప్పుడు మళ్లీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమాలోని సాంగ్స్ సైతం యూట్యూబ్ లో దూసుకుపోయాయి. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఆ సినిమా వార్తలలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా.

గత మూడు నాలుగు రోజులుగా ఓటీటీ ప్రపంచంలో ఓ సినిమా పేరు తెగ మారుమోగుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. తెలుగులో టాప్ డైరెక్టర్.. స్టార్ హీరో కాంబోలో వచ్చిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషించారు.. ఇంతకీ ఆ సినిమా ఏంటో గుర్తుకు వచ్చిందా.. ? అనేనండి.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి. 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.65 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.84.78 కోట్లు సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.114.50 కోట్లు రాబట్టింది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు బాలయ్య.. ఈ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగులో ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర గద్దర్ అవార్డులలో మూడవ స్థానంలో ఉత్తమ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. ఈ మూవీ ఇప్పుడు ట్రెండింగ్ కావడానికి కారణం తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి నటించిన జన నాయకుడు. ఈ హీరో చివరి సినిమా కూడా ఇదే. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
జన నాయకుడు సినిమాను భగవంత్ కేసరి మూవీ ఆధారంగా రూపొందించారు అనే ప్రచారం ముందు నుంచి నడుస్తుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఈ విషయం కన్ఫార్మ్ అయ్యింది. కానీ జన నాయకుడు సినిమా డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ సినిమా కథ పూర్తిగా నిజమని.. ఏ చిత్రాన్ని ఆధారంగా తీసుకోలేదని స్పష్టం చేశారు. కానీ అభిమానులు మాత్రం జన నాయకుడు , భగవంత్ కేసరి సినిమా పోస్టర్స్, సీన్స్ పోలుస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి భగవంత్ కేసరి సినిమాను చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మూవీ ఉన్నట్లుండి ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో.. జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
