OTT Movie: అర్ధరాత్రి కారు వెంటపడే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చేసిన ఐఎమ్‌డీబీ టాప్ హారర్ థ్రిల్లర్
రెండ్రోజుల క్రితమే ఓటీటీలోకి వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. ఒక అర్ధరాత్రి దంపతులు కారులో ప్రయాణించడం, దారి మధ్యలో వారు ఎదుర్కొనే భయానక పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఆఖర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు.

ప్రస్తుతం థియేటర్లలోనైనా, ఓటీటీలోనైనా సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలేద హవా. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో హారర్ థ్రిల్లర్ సినిమాలు అదరగొడుతున్నాయి. అలా రెండ్రోజుల క్రితం ఓటీటీలోకి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. మంగళవారం( జనవరి 06) ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లిపోతోంది. ఈ సినిమాను చూసిన వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇందులోని సన్నివేశాలు చూస్తే కచ్చితంగా వెన్నులో వణుకు పుట్టాల్సిందేనని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యాడీ, ఫ్రాంక్ భార్యభర్తలు, వారి టీనేజ్ కూతురు ఆలీస్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఓ రోజు ఆలీస్ రోడ్డు ప్రమాదానికి గురైందని తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆమె ఓ వ్యక్తిని ఢీకొట్టి, అక్కడి నుంచి పారిపోయిందని మ్యాడీ తెలుసుకుంటారు. దీంతో అర్ధరాత్రే తన భార్యను తీసుకుని ప్రమాదం జరిగిన దగ్గరకు బయలు దేరతాడు. అయితే మార్గ మధ్యంలో వీరికి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. మ్యాడీ కారును ఆత్మలు వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది.
మరి మ్యాడీ దంపతులు తమ కూతురును కలుసుకున్నారా? అసలు ఆలీస్ కు ఏం జరిగింది? మ్యాడీ దంపతుల కారును వెంబడించిందెవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ముఖ్యంగా ఇందులోని క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అని మూవీ చూసిన వారు చెబుతున్నారు.
ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు హాలో రోడ్ జనవరి 06 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బాబక్ అన్వారి డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాస్మండ్ పైక్, మాథ్యూ రైస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మంచి హారర్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఇదొక మంచి ఛాయిస్. ప్రస్తుతం ఇంగ్లిష్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని బాగా ఎంజాయ్ చేయవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
Bloody Disgusting’s Top 15 Best Horror Movies of 2025 – #15 – HALLOW ROAD.
This psychological, real-time thriller gives way to surprising folk horror, revealing an inventive cautionary tale anchored by incredible lead performances by Rosamund Pike and Matthew Rhys. pic.twitter.com/Q9bF5zroas
— Bloody Disgusting (@BDisgusting) January 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




